Advertisementt

విలన్‌గా మెగా హీరో.. వింటానికే విడ్డూరంగా ఉంది

Tue 20th Nov 2018 07:03 PM
varun tej,villain role,jigarthanda,telugu remake,dil raju  విలన్‌గా మెగా హీరో.. వింటానికే విడ్డూరంగా ఉంది
Mega hero Turns Villain for Star Producer విలన్‌గా మెగా హీరో.. వింటానికే విడ్డూరంగా ఉంది
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్‌ని విలన్‌గా చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. వింటానికే విడ్డూరంగా ఉంది కదా..! ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో మాట్లాడుకుంటున్న విషయం ఇదే. వరుణ్ తేజ్ ఏంటి? విలన్ ఏంటి? నమ్మశక్యంగా లేదు కదా!. కానీ నమ్మాలి మరి. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న వరుణ్ తేజ్.. చేసే సినిమాలు, ఎన్నుకునే పాత్రలు అంతే వైవిధ్యంగా ఉంటున్నాయి.

ఇక విషయంలోకి వస్తే.. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్రం ‘జిగర్తాండా’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో బాబీ సింహా విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమాని రీమేక్ చేసేందుకు.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో బాబీ సింహా పాత్రను వరుణ్ తేజ్‌తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటి వరకు హీరోగానే వైవిధ్యమైన పాత్రలు చేసిన వరుణ్.. ఇప్పుడీ విలన్ పాత్రను చేసేందుకు అంగీకరిస్తాడా? అనే అనుమానాల మధ్య ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో మారుమోగుతుంది.

Mega hero Turns Villain for Star Producer:

Varun Tej Choose for The Villain Role in Jigarthanda Telugu Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ