Advertisementt

చెంప దెబ్బ కొట్టలేక చాన్స్‌ మిస్‌ చేసుకుంది!

Wed 21st Nov 2018 12:16 PM
nadhiya,reveals,big secret,nadiya,interview,updates  చెంప దెబ్బ కొట్టలేక చాన్స్‌ మిస్‌ చేసుకుంది!
Nadhiya Reveals Big Secret చెంప దెబ్బ కొట్టలేక చాన్స్‌ మిస్‌ చేసుకుంది!
Advertisement
Ads by CJ

నటనలో, అందంలో, హుందాతనంలో నదియా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈమె గతంలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. 90ల కాలంలో ఈమె హవా సాగింది. తెలుగులో ఈమె సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్దకుమారుడు రమేష్‌బాబు నటించిన ‘బజారురౌడీ’ చిత్రంతో ఈమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇటీవల హీరోయిన్‌ పాత్రలకు బై చెప్పి అమ్మ, వదిన, అత్త క్యారెక్టర్లు చేస్తోంది. ‘మిర్చి, అత్తారింటికిదారేది, దృశ్యం’ చిత్రాల ద్వారా మంచి పేరు సాధించింది. నేటి యంగ్‌ ఆంటీలలో ఈమెకి మంచి డిమాండ్‌ ఉంది. 

ఇక విషయానికి వస్తే ఈమె విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ‘అరణ్యకాండం’ ఫేమ్‌ త్యాగరాజన్‌ కుమర్‌రాజా దీనికి దర్శకుడు. సమంత హీరోయిన్‌ కాగా, దర్శకుడు మిస్కిన్‌, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్కిన్‌ని నదియా కొట్టే సీన్‌ ఒకటుంది. ఆ సన్నివేశం సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నదియాను నిజంగానే మిస్కిన్‌ని కొట్టమని దర్శకుడు చెప్పాడు. దీంతో ఆమె కూడా మిస్కిన్‌ని నిజంగానే కొట్టింది. అలా 56సార్లు నిజంగా నదియా మిస్కిన్‌ని కొట్టినా సీన్‌ బాగా రాలేదు. రెండు రోజుల పాటూ అదే సీన్‌ని చిత్రీకరించారు. దాంతో ఇక తన వల్ల కాదని, అలా కొట్టే సీన్‌ చేయడం తనకి రావడం లేదు కాబట్టి నా పాత్ర స్థానంలో మరొకరని తీసుకోమని చెప్పి ఆమె సినిమా నుంచి వైదొలగింది. 

ఇక మిస్కిన్‌ కూడా ఇక ఈ కొట్టే సీన్‌లో నేను నటించను. ఎన్ని సార్లు కొట్టించుకోవాలి? నటన చేతగాని వారిని తీసుకుని ఇలా చేస్తే నా వల్ల కాదు అని ఆయన నదియా ముందే యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడట. నదియా ‘సూపర్‌డీలక్స్‌’ నుంచి వైదొలగడానికి కారణం ఇదే. దాంతో నదియా పాత్రలో రమ్యకృష్ణని ఎంపిక చేస్తే కేవలం రెండు మూడు షాట్స్‌తోనే ఆమె ఆ సీన్‌ని ఎంతగానో రక్తికట్టించేలా నటించిందట...! ఇప్పుడు ఇదే న్యూస్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

Nadhiya Reveals Big Secret:

Nadhiya Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ