Advertisementt

జనవరి లిస్ట్‌లోకి మరో సినిమా..!

Thu 22nd Nov 2018 08:02 AM
january,prema katha chitram 2,sumanth ashwin,pkc2  జనవరి లిస్ట్‌లోకి మరో సినిమా..!
One More Movie in January Release List జనవరి లిస్ట్‌లోకి మరో సినిమా..!
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్ , నందిత శ్వేతల ‘ప్రేమకథా చిత్రమ్ 2’

ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్న‌తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2’. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ సినిమా మెద‌టిలుక్ ని విడుద‌ల చేసుకుంది. సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేత న‌ట‌న సూపర్ ప్ల‌స్ అవుతుందని చిత్రయూనిట్ తెలుపుతుంది.

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు : 

కెమెరామెన్ - సి. రాం ప్రసాద్, 

ఎడిటర్ - ఉద్ధవ్ య‌స్‌.బి 

సంగీతం - జె.బి 

డైలాగ్ రైటర్ - గ‌ణేష్‌

లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.

ఆర్ట్ - కృష్ణ‌

కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి

నిర్మాత -  ఆర్. సుదర్శన్ రెడ్డి

దర్శకుడు - హరి కిషన్

One More Movie in January Release List:

Prema Katha Chitram 2 Movie Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ