Advertisementt

అల్లురామలింగయ్య మమ్మల్ని తిట్టారు: పరుచూరి!

Fri 23rd Nov 2018 07:31 PM
allu ramalingaiah,praises,paruchuri gopala krishna,ee charitra ye siratho  అల్లురామలింగయ్య మమ్మల్ని తిట్టారు: పరుచూరి!
Paruchuri Gopala Krishna About Allu Ramalingaiah అల్లురామలింగయ్య మమ్మల్ని తిట్టారు: పరుచూరి!
Advertisement
Ads by CJ

హీరోల ఇమేజ్‌, స్టామినా, ఫ్యాన్‌ఫాలోయింగ్‌కి తగ్గట్లే కాదు.. ఆలోచనాత్మక, సామాజిక సందేశం మేళవించిన చిత్రాలకు కూడా రచనలు అందించడంలో పరుచూరి బ్రదర్స్‌ది అందెవేసిన చేయి. అయితే కెరీర్‌ మొదట్లో వారిపై బూతు రచయితలు అనే విమర్శ కూడా ఉండేది. దానిని తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన నోటితో తానే ఒప్పుకున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, మేము కెరీర్‌ను ప్రారంభించిన మొదటిరోజుల్లో ‘బూతులు రాసే రచయితలు వచ్చారు’ అని అల్లురామలింగయ్య గారు మమ్మల్ని తిట్టారు. అలాంటి అల్లురామలింగయ్య ఓ రోజు రాత్రి మాకు ఫోన్‌ చేశారు. ఆరోజుల్లో సెల్‌ఫోన్స్‌ ఉండేవి కాదు కదా...! ట్రంకాల్‌ బుక్‌ చేసుకుని మాట్లాడాల్సివచ్చేది. 

ఆయన ఫోన్‌ చేసి ‘ఎవరు? పరుచూరి గోపాలకృష్ణయేనా?’ అని అడిగారు. నేను ‘అవునండీ’ అని చెప్పాను. ‘అనురాగదేవత’ రాసిన వాడివేనా? అని అడిగారు. అవునని చెప్పాను. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చిత్రానికి రచయిత పరుచూరి గోపాలకృష్ణ అని పడింది. అది నువ్వేనా? అని అడిగితే ‘అవునండీ’ అని సమాధానం ఇచ్చాను. ‘ఎంత గొప్పగా రాశావయ్యా’ అని ఆయన తనదైనశైలితో నన్ను మెచ్చుకున్నారు. 

అప్పటి నుంచి నేను ఆయనని ‘బాబాయ్‌’ అని ప్రేమతో పిలిచేవాడిని అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. నిజంగా పరుచూరి కలంలోని సామాజిక స్పృహను ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చిత్రం నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందనే చెప్పాలి. 

Paruchuri Gopala Krishna About Allu Ramalingaiah:

Then Allu Ramalingaiah Praises me

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ