Advertisementt

వర్మకి, బాలయ్యకి మధ్య సవాల్‌గా మారుతోంది!

Tue 27th Nov 2018 05:04 PM
balayya ntr,rgv,lakshmis ntr,controversy,ram gopal varma,nandamuri taraka ramarao  వర్మకి, బాలయ్యకి మధ్య సవాల్‌గా మారుతోంది!
Ram Gopal Varma vs Nandamuri Balakrishna వర్మకి, బాలయ్యకి మధ్య సవాల్‌గా మారుతోంది!
Advertisement
Ads by CJ

ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. కాంట్రవర్సీ సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. అందుకు ఉదాహరణలు ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’. ఇప్పుడు కొత్తగా ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ అని బయటకు వచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలోని చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెడ‌తా అని ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ కెరీర్‌లోని ఆఖ‌రి మ‌జిలీ.. అంత గొప్ప‌గా ఏం సాగ‌లేదు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయ్యాక నందమూరి కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. ఆమె అలా ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టగానే ఎన్టీఆర్ తన నందమూరి కుటుంబానికి దూర‌మ‌య్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ సీఎం అవ్వడం.. ఆ తర్వాత ఎన్టీఆర్ ను రాజకీయంగా వెన్నుపోటు పొడవటం వంటివి ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య చూపించరు కాబట్టి వర్మ ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ చూపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

అందుకే ఈ సినిమాను ‘ఎన్టీఆర్’ పార్ట్ 1కీ, 2కీ మ‌ధ్య రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేస్తున్నాడు. లక్ష్మి పార్వతి కూడా ఈసినిమా తీయడానికి ఒప్పుకుంది కానీ తనకు ఈ సినిమా స్టోరీ ముందే చెప్పాలని కండిషన్ పెట్టింది. అందుకు వర్మ అసలు ఒప్పుకోడని తెలిసిన విషయమే. రిలీజ్ కి ముందు సినిమాను చూపించాలన్న ఒప్పుకోడు కాబట్టి వ‌ర్మ‌కీ, ల‌క్ష్మీపార్వ‌తికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం దాదాపు అసాధ్యం.

మరోవైపు వర్మ ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ను అడ్డుకోవాలని నందమూరి కుటుంబం ట్రై చేస్తుంది. ఈసినిమా రిలీజ్ అవ్వకుండా బాలయ్య ఏదో ఓ మెలిక పెట్ట‌డం ఖాయమ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. మరి ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎలా విడుదల అవుతుందనేదే పెద్ద ప్రశ్న. మరోపక్క ఈ సినిమా అసలు సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆపాలని నందమూరి కుటుంబం చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Ram Gopal Varma vs Nandamuri Balakrishna:

Balayya NTR vs RGV Lakshmis NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ