Advertisementt

‘కవచం’ రిలీజ్ ఆపేశారు.. కారణం ఇదేనంట!

Tue 27th Nov 2018 06:53 PM
kavacham,bellamkonda srinivas,release postponed,kavacham movie  ‘కవచం’ రిలీజ్ ఆపేశారు.. కారణం ఇదేనంట!
Kavacham Movie Release Postponed ‘కవచం’ రిలీజ్ ఆపేశారు.. కారణం ఇదేనంట!
Advertisement
Ads by CJ

టపటప వరసగా నాలుగు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ‘అల్లుడు శీను’.. ‘జయ జానకి నాయక’ మంచి టాక్ దక్కించుకున్నా వసూల్ పరంగా హిట్ కాలేకపోయాయి. ఇక రీసెంట్‌గా ‘సాక్ష్యం’తో డిజాస్టర్ అందుకున్న శ్రీనివాస్.. ఈసారి ఏ మాత్రం తగ్గకుండా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మొదట పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘కవచం’ అనే సినిమాతో పలరించబోతున్నాడు. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈసినిమా యొక్క టీజర్‌ ఇటీవలే విడుదల చేశారు. డిసెంబరు 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది. డిసెంబరు నెలలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక జనవరి‌లో రిలీజ్ అంటే సంక్రాంతి రేస్‌లో పెద్ద సినిమాలు ఉన్నాయి. సో జనవరి నెలాఖరుకో ఫిబ్రవరికో తప్ప మళ్లీ డేటు దొరకడం కష్టం. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు కానీ సడన్ గా ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్ధం కావట్లేదు. కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. తర్వలోనే ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఈసినిమా కాకుండా తేజ డైరెక్షన్ లో కాజల్ తో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

Kavacham Movie Release Postponed:

Doubts on Bellamkonda Srinivas Movie Kavacham Release 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ