సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవికి నందమూరి బాలకృష్ణకి విపరీతమైన యుద్దం ఉన్నప్పటికీ తనకు ఉన్న ఫ్రెండ్స్‌లో చిరంజీవే ముందుంటాడని బాలయ్య,.. అదే మాటను మెగాస్టార్ కూడా చెబుతూ ఉంటాడు. ఇక వీరిద్దరు ఒకరి సినీ ప్రారంభోత్సవాలకు మరొకరు, ఇక ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌కి కూడా హాజరవుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ ఇంటి కోడలు, రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన కొణిదెల, నందమూరి బాలకృష్ణ కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ శ్రీమతి బ్రాహ్మణిలు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరు మంచి భార్యలుగానే కాకుండా అటు ఉపాసన అపోలో ఫౌండేషన్‌కి వైస్ చైర్మన్‌గా ఉంటూ ఉంటే, నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాగుతూ, వ్యక్తిగత, వృతిపరమైన జీవితాలలో కూడా ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా వీరిద్దరు ఈజిప్ట్‌కి వెళ్లారు. యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్‌లో నారా బ్రాహ్మణి-ఉపాసన కొణిదెల ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. ఈ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వారు ఇటీవల 85మంది సభ్యులతో ఈజిప్ట్ ట్రిప్‌ని అరేంజ్ చేశారు. అక్కడ చిరు కోడలు, బాలయ్య కుమార్తె ఎంతో బాగా కలిసి పోయి ఈజిప్ట్‌లోని గ్రేట్ గాజా పిరమిడ్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరు ఈజిప్ట్‌లో బాగా సందడి చేస్తూ, పిరమిడ్లతో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. గురు, శుక్ర, శని వారాల్లో వారు ఈజిప్ట్‌లో బాగా ఎంజాయ్ చేశారు.
ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొణిదెల ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. మూడు రోజుల పాటు ఈజిప్ట్‌లో ఉన్నామని, మరిచి పోలేని ట్రిప్ ఇదనీ, చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని మరీ చర్చించామని ఆమె తెలిపింది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వారి అభిమానులనే కాదు.. నెటిజన్లను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది.