Advertisementt

హీరోయిన్ ఝలక్.. మెగా హీరోకి అవమానం!

Fri 30th Nov 2018 09:23 AM
heroine,jhalak,shock,kalyaan dhev,mehreen,advance,reject  హీరోయిన్ ఝలక్.. మెగా హీరోకి అవమానం!
Mega Hero Shocks with Heroine Decision హీరోయిన్ ఝలక్.. మెగా హీరోకి అవమానం!
Advertisement
Ads by CJ

తాజాగా మెగా హీరో అదేనండి మెగా ఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో ప్రాజెక్ట్ నుండి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ తప్పుకుందని... అలాగే కన్నుకొట్టి అందరిని పడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే న్యూస్ మాములుగా వినబడలేదు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలోనూ ఈ న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొట్టింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... మెగాస్టార్ చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈమధ్యనే హీరోగా పరిచయం అయ్యాడు. అయితే కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కొత్త దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో మొదలైంది. అసలు ఈ పులి వాసు ముందుగా సుధీర్ బాబు హీరోగా సినిమాని మొదలెట్టాలనుకున్నాడు.

కానీ పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా నిర్మాతకు, సుధీర్ బాబుకి గొడవలవడంతో... ఆ సినిమా ఆగిపోవడం.. అదే కథతో పులి వాసు.. కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమా మొదలు పెట్టడం జరిగింది. అయితే సుధీర్ బాబు హీరోగా సినిమా మొదలవుతుందననుకున్నప్పుడు సుధీర్ బాబుకి పక్కన హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ని ఫైనల్ చేసింది చిత్ర బృందం. కానీ సుధీర్ బాబు తప్పుకోవడంతో, ఆ ప్లేస్ లోకి కళ్యాణ్ దేవ్ వచ్చి చేరాడు. అయితే సుధీర్ బాబు హీరోగా అయితే ఓకే, కళ్యాణ్ దేవ్ అయితే సినిమా చేయనని మెహ్రీన్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. అలాగే సుధీర్ బాబుతో సినిమా అనుకున్నప్పుడు మెహ్రీన్‌కి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఫైనల్ చేశారట. 

కానీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ హీరో అనేటప్పటికీ... ఆ సినిమా చెయ్యనున్న మెహ్రీన్ ఇప్పుడు అడ్వాన్స్ కూడా ఇవ్వనంటుందట. పైగా హీరోని మార్చి మోసం చేసారంటూ ఫైర్ అవుతుందట. పాపం మెగా హీరో కళ్యాణ్ కి ఎన్ని కష్టాలు. ముందు ప్రియా ప్రకాష్ తప్పుకుంటే ఇప్పుడు మెహ్రీన్ తప్పుకుని షాక్ ఇచ్చింది. కానీ నిర్మాతలు మాత్రం హీరో ఎవ్వరైనా మెహ్రీన్ సినిమా చెయ్యాల్సిందే అంటున్నారట. మరి మెహ్రీన్ ఆ సినిమా నుండి తప్పుకుంటే తప్పుకుంది... కనీసం అడ్వాన్స్ అన్నా వెనక్కి ఇస్తే మరో హీరోయిన్ ని వెతుక్కుంటారు కదా నిర్మాతలు. ఏందో ఈ సినిమావాళ్లు.. ఒక పట్టాన అర్థంకారసలు. 

Mega Hero Shocks with Heroine Decision:

Mehreen Jhalak to Chiranjeevi Son In Law