టాలీవుడ్ స్టైలిష్ హీరోల్లో అల్లు అర్జున్ ది మొదటి స్థానం. అందుకే ఆయనను అభిమానలంతా ముద్దుగా స్టైలిష్‌స్టార్ అంటుటారు. ఎప్పుడూ స్పీడుగా సినిమాలు చేసే ఈ అల్లువారబ్బాయి కొత్తగా వేగం తగ్గించాడు. తన తదుపరి సినిమా విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడు. ఎప్పుడూ చలాకీగా ఉరకలేసే ఉత్సహంతో వుండే అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో వేగం తగ్గించడానికి కారణమేంటీ?. తదుపరి సినిమా విషయంలో మునుపెన్నడూ లేనంతగా ఎందుకు డైలమాలో పడుతున్నాడు?.. ఇవి ప‌్రస్తుతం మెగా అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్నలు.
మాటల మాంత్రికుడితో కలిసి చేసిన `సన్నాఫ్ సత్యమూర్తి` నుంచి ఈ స్టైలిష్‌స్టార్ కెరీర్ గతితప్పుతూ వస్తోంది. ఎన్నో ఆశలు, ఎన్నో ప్రయాసలకోర్చి చేసిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` కూడా చివరికి బాక్సాఫీస్ వద్ద అడ్రస్ లేకుండా పోవడం అల్లు అర్జున్‌ను ఆలోచనలో పడేసిందట. దీనికి ముందు వచ్చిన ఓ పాత్ బ్రేకింగ్ సినిమా అల్లు అర్జున్ ని బాగా డిస్ట్రబ్ చేసిందని, అప్పటి నుంచే అతనిలో మార్పు మొదలైందని అంటున్నారు. అల్లు అర్జున్‌ను డిస్ట్రబ్ చేసిన పాత్ బ్రేకింగ్ సినిమా మరేదో కాదండోయ్ విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసిన `అర్జున్‌రెడ్డి`. ఒక్క అల్లు అర్జున్ నే కాదు ఇండస్ట్రీలో వున్న హీరోలందరికి ఓ థ్రెట్‌లా మారిందా సినిమా.
ఈ చిత్రం విడుదల తరువాత ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపాడట అల్లు అర్జున్.. ఈ విషయాన్ని బాహాటంగానే `గీత గోవిందం` ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా చెప్పిన ఆయన గత కొంత కాలంగా ఆ తరహా పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడని, ఆ హ్యాంగోవర్‌లో వున్న తనకు మరోకథ ఎక్కడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తదుపరి సినిమా కోసం టైమ్ వేస్ట్ చేస్తున్నాడని, ఆ కారణంగానే విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్‌ను తిరస్కరించాడని చెబుతున్నారు. అందుకే దిల్ రాజు రీమేక్ హక్కులు తీసుకున్న `96` విషయంలో ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడని, వీటన్నింటినీ పక్కన పెట్టి త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను వెంటనే పట్టాలెక్కిస్తే మంచిదని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి అల్లు అర్జున్ ఏమంటాడో.