Advertisementt

దేవిశ్రీని తప్పిస్తున్న చరణ్?

Tue 04th Dec 2018 04:07 PM
amit trivedi,ram charan,boyapati srinu,koratala siva  దేవిశ్రీని తప్పిస్తున్న చరణ్?
Charan Says No to Devi Sri దేవిశ్రీని తప్పిస్తున్న చరణ్?
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు పరాజయం ఎరుగని కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. గత రెండు రోజులుగా చిరు కి సై రా రీ షూట్స్ వలన కొరటాల మూవీని వదులుకుంటున్నాడనే న్యూస్ ఫిలింనగర్ సాక్షిగా చక్కర్లు కొట్టింది. అయితే అదంతా ఒట్టి రూమారంటుంది మెగా కంపౌండ్. ఇకపోతే కొరటాల శివ చెప్పిన లైన్ కు చిరు ఇంప్రెస్స్ అవ్వడంతో రామ్ చరణ్ ఈసినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల కథ చర్చల్లో ఉన్నప్పుడు ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తీసుకుంద్దాం అని డిసైడ్ అయ్యాడట.

కొరటాల చేసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అందించాడు.  అలాగే చిరు - దేవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు శివ. అయితే శివ నిర్ణయానికి చరణ్ నో చెప్పాడట. చిరు సినిమాకు దేవిశ్రీ వద్దని చరణ్ భావిస్తున్నాడట.

దేవి కి బదులు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ని పెట్టుకుందాం అని కొరటాల శివకి చరణ్ చెప్పినట్లుగా చెబుతున్నారు. అమిత్ త్రివేది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న సైరా సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు చిరు - కొరటాల సినిమాకి కూడా అతనే మ్యూజిక్ అందించనున్నాడని సమాచారం. 

Charan Says No to Devi Sri:

Amit Trivedi Replaces Devi Sri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ