ఎలక్షన్స్ నేపధ్యంలో పోలీటీషియన్స్ సీక్రెట్ లైఫ్స్ వెలుగులోకి రావడం లేదా తేవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఆపోజిట్ లీడర్ ఇమేజ్ పై బురద జల్లేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. అయితే.. నిన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల కోలాహలంలో ఓ స్టార్ పొలిటీషియన్ రంకు వ్యవహారం బయటపడింది. అది కూడా ఓ సూపర్ స్టార్ హీరోయిన్ తో. దాంతో తెలంగాణ రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సదరు స్టార్ పొలిటీషియన్ కి ఈ రంకు వ్యవహారాలు కొత్తేమీ కాదు.. ఇదివరకూ కూడా అప్పటి స్టార్ హీరోయిన్ తో రెండేళ్లపాటు ఈ వ్యవహారాల్ని కొనసాగించాడట. ఇప్పుడు ఆమె మరో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడంతో.. కొత్త స్టార్ హీరోయిన్ ని పట్టాడు. ఆమెకి జూబ్లీ హిల్స్ లో ఓ కాస్ట్లీ బిల్డింగ్ కొనివ్వడమే కాక ఆమెకు కావాల్సినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాడట.
ఇప్పుడు ఆ సీక్రెట్ ఎఫైర్ కాస్తా ఎలక్షన్స్ వేడిలో పబ్లిక్ అయిపోవడంతో ఏం చేయాలో తెలియని కంగారులో కొట్టుమిట్టాడుతున్నారిద్దరూ. ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో మాత్రమే సర్క్యులేట్ అవుతున్న సదరు సీక్రెట్ ఎఫైర్ జనాల్లోకి వచ్చిందంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సదరు పొలిటీషియన్ గారికి కుర్ర కారులో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే ఈ అమ్మడు సైతం అటు కార్పొరేట్ బ్రాండ్లతో ఇటు స్టార్ హీరోల సినిమాలతో అయ్యగారి పుణ్యమాని ఇండస్ట్రీలో పీక్ స్టార్ డం ఎంజాయ్ చేసింది.
సొ, ఆ ఇష్యూ పబ్లిక్ కి తెలియకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు పడుతున్నాడు ఆ స్టార్ పొలిటీషియన్.