బాహుబలితో బాలీవుడ్ ని వణికించిన ప్రభాస్ ని బాలీవుడ్ కి స్ట్రయిట్ ఎంట్రీ ఇప్పించి ప్రభాస్ క్రేజ్ ని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అయితే కరణ్ జోహార్ తో కలిసి పనిచేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నప్పటికీ... బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసే సరికి కరణ్ జోహార్ ప్రభాస్ ని పక్కన పెట్టేశాడనే టాక్ నడిచింది. అలా అనుకోకుండా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఆగిపోయింది. అయితే బాహబలి విషయంలో బాగా హెల్ప్ చేసిన కరణ్ జోహార్ తో దర్శకుడు రాజమౌళి మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాడు. తాజాగా కరణ్ కి ప్రభాస్ కి మధ్యన సంధి చేసి మరీ కాఫీ విత్ కరణ్ షోకి కూడా రాజమౌళి, ప్రభాస్ ని తీసుకెళ్లాడు అనే ప్రచారం ఉంది. ఇక రాజమౌళి, రానా, ప్రభాస్ లు కాఫీ విత్ కరణ్ షోలో హంగామా చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ కూడా బాహుబలితోనే కాదు. సాహోతో కూడా బాలీవుడ్ ని కొల్లగొడితే అక్కడి దర్శకనిర్మాతలు ఆటోమాటిక్ గా దారికొస్తారని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ప్రభాస్ వ్యవహారం కూడా.
ఇక కరణ్ జోహార్ కూడా ప్రభాస్ తో పని జరగదని తెలుసుకున్నట్లుగానే కనబడుతున్నాడు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో కుర్రకారులో క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన విజయ్ తో కరణ్ జోహార్ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా ఎప్పటినుండో వార్తలుండడం ... కరణ్ విత్ కాఫీ షోలో జాన్వీ కూడా విజయ్ దేవరకొండ పేరు చెప్పడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చెయ్యడమే కాదు.. విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ టచ్ లో ఉంటూ కథ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే డియర్ కామ్రేడ్ తప్ప మరే సినిమాని ఒప్పుకోని విజయ్ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ లో చేయబోతున్నాడా? అనే దానికి క్లారిటీ లేదుగాని... విజయ్ బాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటున్నారు విజయ్ సన్నిహితులు.