Advertisementt

తెలుగు 96లో త్రిష, విజయ్‌గా వీరే!

Fri 14th Dec 2018 01:15 PM
trisha,vijay sethupathi,96 movie,telugu remake,samantha,sharwanand  తెలుగు 96లో త్రిష, విజయ్‌గా వీరే!
96 Telugu Remake Hero, Heroine Confirmed తెలుగు 96లో త్రిష, విజయ్‌గా వీరే!
Advertisement
Ads by CJ

రెండు నెలల క్రితం తమిళంలో ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి దిగి పలు సంచలనాలు సృష్టించిన 96  సినిమా హడావిడి ఇంకా ముగియలేదు. 96 తమిళ ట్రైలర్ విడుదల చేసిన వెంటనే ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ సినిమాని తెలుగులో రీమేక్ ప్లాన్ చేశాడు. అయితే దిల్ రాజు 96 హక్కులు కొని భద్రపరిచారు కానీ.... ఆ సినిమాలో హీరో, అంటే ఒరిజినల్ 96 లో హీరో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి హీరోయిన్ మెయిన్ లీడ్ లో నటించిన త్రిష క్యారెక్టర్ కి ఏ హీరో, హీరోయిన్ ని తీసుకోవాలో తెలియక కింద మీద పడుతున్నాడు. ముందుగా ఆ సినిమా చూసిన నాని ఆ సినిమాలో హీరోగా చేయలేనని.. నిర్మాణంలో భాగస్వామినవుతానని దిల్ రాజుతో చెప్పాడు. ఇక మెగా హీరో అల్లు అర్జున్ కూడా తమిళ 96 సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ చూపించినా హీరోగా చెయ్యడానికి సాహసించలేదు.

తాజాగా ఈ సినిమాకి మాస్ హీరో గోపీచంద్ ఫిక్స్ అయ్యాడనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో నడిచాయి. అయితే గోపీచంద్ కూడా 96 లో నటించడం లేదనేది లేటెస్ట్ న్యూస్. తాజాగా దిల్ రాజుకి హీరో, హీరోయిన్స్ దొరికేశారట. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ లో 96 లో నటించబోయే ఆ హీరో మరెవరో కాదు.. కుర్ర హీరో శర్వానంద్ అంట. తమిళ 96 లో విజయ్ సేతుపతి చేసిన పాత్రని టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ చేయబోతున్నాడట. 

ఇక మెయిన్ అండ్ లీడ్ క్యారెక్టర్ లో హాటెస్ట్ హీరోయిన్ సమంత నటిస్తుందట. ఎప్పటినుండో తమిళ 96 లో త్రిష రోల్ తెలుగులో సమంత ప్లే చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్టే 96 తెలుగు రీమేక్ లో సమంతనే నటిస్తుందట. తమిళంలో ఎంతగానో మెప్పించిన త్రిష రోల్ కి సమంతనే న్యాయం చేస్తుందంటున్నారు. అందుకే హీరోగా శర్వానంద్ ని, హీరోయిన్ గా సమంతని 96 తెలుగు రీమేక్ కోసం ఫైనల్ చేశారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకాబోతుందంటున్నారు. త్వరలోనే 96 తెలుగు రీమేక్ నటీనటుల ఇతరత్రా విషయాలు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారట.

96 Telugu Remake Hero, Heroine Confirmed:

Sharwanand and Samantha in 96 Telugu Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ