Advertisementt

ఈ మెగా హీరోకి మళ్లీ హిట్టే.. ఇదిగో సాక్ష్యం!

Mon 17th Dec 2018 02:23 PM
antariksham movie,censor talk,varun tej,super hit,krish,mega hero film  ఈ మెగా హీరోకి మళ్లీ హిట్టే.. ఇదిగో సాక్ష్యం!
Censor Talk Very Positive to Mega Hero Film ఈ మెగా హీరోకి మళ్లీ హిట్టే.. ఇదిగో సాక్ష్యం!
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి - అదితిరావు హైద‌రి నటిస్తున్న ‘అంత‌రిక్షం 9000 KMPH’ చిత్రంను ‘ఘాజీ’ ఫేం సంక‌ల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై క్రిష్, జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమా యొక్క సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాకు క్లీన్ ‘యు’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ స‌భ్యులు. 

మిరా అనే శాటిలైట్‌ అనుకోకుండా దారి తప్పటంతో ప్రపంచంలోని కమ్యూనికేషన్‌ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో దేవ్ అనే వ్యక్తి ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంట్రీ ఇస్తాడు. మరి దేవ్ ఆ శాటిలైట్‌‌ను మళ్లీ దారిలోకి ఎలా తీసుకుని వచ్చాడు అనేది మిగిలిన సినిమా అని అంటున్నారు. ‘ఘాజీ’ సినిమాతో ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసిన సంకల్ప్ మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో ఇటువంటి స్పేస్‌ సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు. ఇదే తొలి సినిమా. సో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు.

చిత్రం చూసిన సెన్సార్ స‌భ్యులు, చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించార‌ట. ఈ చిత్రంతో డైరెక్టర్ సంక‌ల్ప్ రెడ్డి అందరినీ స్టన్ చేస్తాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు కానీ బిగి స‌డ‌ల‌ని క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌ని సీట్ల‌కు అతుక్కునిపోయేలా చేస్తుంద‌ట ఈ చిత్రం. కొన్నికొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని థ్రిల్ చేయ‌డం గ్యారెంటీ అని యూనిట్ చెబుతుంది. క్రిష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం. మరి ఏమవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Censor Talk Very Positive to Mega Hero Film:

Antariksham Movie Censor Completed.. Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ