Advertisementt

విజయ్ దేవరకొండకు పెద్ద గండం తప్పింది..!

Mon 17th Dec 2018 10:13 PM
vijay deverakonda,accident,dear comrade,shooting spot,train accident  విజయ్ దేవరకొండకు పెద్ద గండం తప్పింది..!
Accident to Vijay Deverakonda at Dear Comrade shooting spot విజయ్ దేవరకొండకు పెద్ద గండం తప్పింది..!
Advertisement
Ads by CJ

‘నోట’ చిత్ర రిజల్ట్‌తో డిజప్పాయింట్‌లో ఉన్న విజయ్ దేవరకొండని.. తిరిగి ‘టాక్సీ‌వాలా’ నిలబెట్టింది. ఇకపై చేసే ప్రతి చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా చేస్తానని మాట ఇచ్చిన విజయ్.. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో తన లక్కీగాళ్ రష్మిక హీరోయిన్ కావడం మరో విశేషం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కాకినాడలో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో విజయ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలుస్తుంది.

రైల్వే‌స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేగంగా మెట్లు దిగి ఫ్లాట్ ఫామ్ పైన పరుగెత్తుతూ రైలు అందుకోవాలి. ఈ సీన్‌లో యాక్ట్ చేస్తున్న టైములో విజయ్ పరుగెత్తుతూ ట్రైన్ ఎక్కబోయి, ఏకంగా ట్రైన్ కింద పడిపోతూ తమాయించుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది పక్కకు లాగేయడంతో ఘోర ప్రమాదం నుండి విజయ్ తప్పించుకున్నాడు. 

చేతికి చిన్న గాయం అవ్వడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత విజయ్ హోటల్‌కు చేరుకొని తనకు తగిలిన దెబ్బల్ని చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. లైఫ్‌లో ఏదీ అంత ఈజీగా రాదు అని పోస్ట్ చేసాడు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడున్న ఓ వ్యక్తి ఈ యాక్సిడెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియా‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Accident to Vijay Deverakonda at Dear Comrade shooting spot:

Vijay Deverakonda Suffers Minor Injuries

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ