Advertisementt

కళ్యాణ్‌రామ్‌.. క్లూ ఇచ్చేశాడు..!

Wed 19th Dec 2018 01:43 AM
kalyan ram,shalini pandy,nivetha thomas,118 teaser,guhan,118 taser review  కళ్యాణ్‌రామ్‌.. క్లూ ఇచ్చేశాడు..!
Kalyan Ram 118 Teaser Review కళ్యాణ్‌రామ్‌.. క్లూ ఇచ్చేశాడు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నిర్మాతగా పక్కకు తప్పుకుని హీరోగా సినిమాలను వన్ బై వన్ చేసుకువెళుతున్న హీరో కళ్యాణ్ రామ్. ఈ ఏడాది రెండు డిజాస్టర్స్ అందుకున్నాడు. తాజాగా 118 అనే థ్రిల్లర్ మూవీ  టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఎపుడూ కమర్షియల్ సినిమాలనే నమ్ముకునే కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మాత్రం థ్రిల్లర్ నేపథ్యం ఉన్న డిఫ్రెంట్ కథను ఎంచుకుని వైవిద్యం చూపిస్తున్నాడు. 118 టీం ముందు నుంచి ఈ సినిమా థ్రిల్ల‌ర్ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పినట్టుగా టీజర్‌ని కూడా అలాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోనే కట్ చేసి వదిలారు.

118 అంటే ఎదో నెంబర్ అని అపోహాపడిన ప్రేక్షకులకు గుహన్ టీజర్‌లో క్లూ ఇచ్చేసాడు. 118 అనేది టైం.. అర్ధరాత్రి 1 గంట 18 నిమిషాలకు జరిగిన సంఘటనతో.. కళ్యాణ్ రామ్ లైఫ్‌ ఏ విధమైన మలుపు తిరిగిందో అనేదాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఇక షాలిని పాండే తో కళ్యాణ్ రామ్ రొమాన్స్ కానీ... కళ్యాణ్ రామ్ లుక్స్ కానీ కొత్తగా ఉన్నాయి. హీరోయిన్ షాలిని కాస్తబొద్దుగా కనబడినా.. ఆమె మాత్రం కళ్యాణ్ రామ్ పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక టీజర్ మొత్తంలో మరో హీరోయిన్ నివేత థామస్ ఎక్కడా కనబడలేదు. అంటే ఈ 118 కి నివేత థామస్ కి ఎక్కడో లింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.

ఇక కళ్యాణ్ రామ్ టెన్షన్, టీజర్‌లో సస్పెన్స్ చూస్తుంటే సినిమాలో ఏదో ఉందనిపిస్తుంది. మరి టీజర్‌తో సినిమా మీద అంచనాలయితే పెంచగలిగారు. సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, సినిమా టీజర్ కి ఫోటోగ్రఫీ హైలెట్‌గా కనబడడమే కాదు.. నేపధ్య సంగీతం కూడా అదిరింది. మరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పక్కాగా హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు.

Click Here for Teaser

Kalyan Ram 118 Teaser Review:

Kalyan Ram, Shalini Pandy and Nivetha Thomas Starring 118 Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ