Advertisementt

వరుణ్ తేజ్.. ‘చీకట్లో సూర్యుడా’..!?

Wed 19th Dec 2018 09:02 AM
varun tej,antariksham,yandamuri,cheekatlo suryudu novel,rumours  వరుణ్ తేజ్.. ‘చీకట్లో సూర్యుడా’..!?
Rumours on Varun Antariksham Story వరుణ్ తేజ్.. ‘చీకట్లో సూర్యుడా’..!?
Advertisement
Ads by CJ

మరో మూడు రోజుల్లో వరుణ్ తేజ నటించిన ‘అంత‌రిక్షం’ సినిమా విడుదల అవ్వబోతుంది. లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘ఘాజి’ లాంటి సూపర్ హిట్ చిత్రంను అందించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. క్రిష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఇప్పుడు నుండే స్టార్ట్ అయింది.

అంత‌రిక్షం నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో సినిమా రాలేదు. అందుకే ఈ సినిమా కోసం తెలుగు చిత్ర‌సీమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ట్రైలర్ బట్టి ఇది సైన్స్ ఫిక్ష‌న్ అని ఈజీగా గెస్ చేయొచ్చు కానీ ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది. సంకల్ప్ ఆ లవ్ స్టోరీని బాగా డీల్ చేశాడని తెలుస్తుంది. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల ‘చీక‌ట్లో సూర్యుడు’ లోని ఉన్న పాయింట్ కు ఈ సినిమాలో లవ్ స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు సమాచారం.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రచించిన ‘చీక‌ట్లో సూర్యుడు’ లో కూడా స్పేస్ గురించి ఉంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ ఆస్ట్రోనాట్‌లే. వీరిద్దరూ లవ్ చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనుకోకుండా వాళ్లిద్ద‌రే కొంత‌కాలం అంత‌రిక్షంలో ఉండాల్సివ‌స్తుంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఎదురైన సంఘటనలు.. మళ్ళీ తిరిగి ఎలా కలుసుకున్నారో ‘చీక‌ట్లో సూర్యుడు’ క‌థ‌. ఇప్పుడు ఇంచుమించు అదే పాయింట్ మన ముందుకు రానున్నాడు సంకల్ప్.

Rumours on Varun Antariksham Story:

Similarities Between Antariksham and Yandamuri Cheekatlo Suryudu Novel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ