గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా? బాలయ్య, ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కోసం పిలిచాడా? ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కోసం ఇంకా పిలుపందుకోని యంగ్ టైగర్? బాలయ్య అసలు ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపిస్తాడా? అంటూ చాలా రకాల వార్తలు మీడియాలో వినబడుతూనే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో వేడుక రేపు జెఆర్సీ హైదరాబాద్ లో జరగబోతుంది. అయితే ఎప్పటినుండో ఎన్టీఆర్ ని దూరం పెడుతున్న బాలయ్య.. హరికృష్ణ మరణంతో.. ఎన్టీఆర్ కి దగ్గరైనట్టుగా కనిపించాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కి స్థానాన్ని కల్పించలేదు. కనీసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా తీసుకోలేదనే టాక్ ఉంది. ఇక అరవింద సమేత సక్సెస్ మీట్ లో అంటీముట్టనట్లుగా బాలయ్య పాల్గొన్నాడు. నందమూరి ఫ్యామిలీ ఒక్కటైంది అనుకునేలోపు... మళ్ళీ తెలంగాణ ఎన్నికలతో బాలయ్య, ఎన్టీఆర్ ల బంధం బీటలు వారినట్లుగా కథనాలు వచ్చాయి.
ఇక తాజాగా రేపు జరగబోయే ఎన్టీఆర్ బయోపిక్ వేడుకకి ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదని న్యూస్.. పేపర్స్ లో, వెబ్ మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలొచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. ఇది కన్ఫర్మ్. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ బయోపిక్ ఈవెంట్ కి హాజరవడమే కాదు..... ప్రత్యేక అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, జమున, గీతాంజలి వంటి సీనియర్ స్టార్స్ కూడా హాజరవుతున్నట్టుగా సమాచారం. మరి ఈ ఎన్టీఆర్ బయోపిక్ మీదున్న అంచనాలు ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో మరింతగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.