Advertisementt

ఊహించ‌ని హీరోతో నాని మ‌ల్టీస్టార‌ర్‌!

Fri 21st Dec 2018 11:01 AM
nani,vishal,yatra,mahi v raghav,mammootty,pvp cinema,prasad v potluri,  ఊహించ‌ని హీరోతో నాని మ‌ల్టీస్టార‌ర్‌!
nani new multi starrer ఊహించ‌ని హీరోతో నాని మ‌ల్టీస్టార‌ర్‌!
Advertisement
Ads by CJ

ఇండ‌స్ట్రీలో వున్న అంద‌రి హీరోల‌తో నానికి మంచి అనుబంధం వుంది. త‌ను వున్నంత‌ క‌లివిడిగా ఏ హీరో వుండ‌డు. నానిని ద‌గ్గ‌ర‌గా చూసిన చాలా మందికి ఈ విష‌యం బాగా తెలుసు. `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ‌`లో జై బాల‌య్య అన్నా... `దేవ‌దాస్‌`లో నాగార్జున‌తో క‌లిసి మందుకొట్టినా.. నానికే చెల్లింది. ఇక మెగా క్యాంపు, ద‌గ్గుబాటి వారితో నానికి వున్న అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా అందిరితో క‌లిసిపోయే నాని త్వ‌ర‌లో ఊహించ‌ని హీరోతో కొత్త అడుగు వేయ‌బోతున్నాడు. ఆ హీరో మ‌రెవ‌రో కాదండోయ్ త‌మిళ నాట సంచ‌ల‌నం సృష్టిస్తున్న‌విశాల్‌..  దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత క‌థ ఆధారంగా మ‌హి వి. రాఘ‌వ్ ప్ర‌స్తుతం `యాత్ర‌` చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. 

ఇందులో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న పాత్ర‌కు మ‌మ్ముట్టి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 2019 ఎన్నిక‌ల‌ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేయ‌డానికి స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఈయితే ఈ సినిమా త‌రువాత మ‌హి వి. రాఘ‌వ్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. 

ఇందులో నాని, విశాల్ న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఓ స‌రికొత్త పాయింట్‌తో మ‌హి వి. రాఘ‌వ్ చెప్పిన క‌థ ఇద్ద‌రిని ఇంప్రెస్ చేసింద‌ట‌. దాంతో మ‌హి చిత్రంలో న‌టించ‌డానికి ఇద్ద‌రూ అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా అధినేత ప్ర‌సాద్ వి. పొట్లూరి నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఓంకార్ ఇచ్చిన షాక్‌తో `రాజు గారి గ‌ది-2` త‌రువాత మ‌రో సినిమా ప్ర‌క‌టించ‌ని పీవీపీ క‌థ కొత్త‌గా వుండ‌టం, మ‌హి టాలెంట్ పై న‌మ్మ‌కం వుండ‌టంతో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రెండు భాష‌ల్లో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 

nani new multi starrer:

nani - vishal multi starrer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ