Advertisementt

బాలయ్య గెటప్స్ చూసి సూపర్‌స్టార్ ఫిదా!

Sat 22nd Dec 2018 05:12 PM
balakrishna,super star krishna,naresh,ntr getups  బాలయ్య గెటప్స్ చూసి సూపర్‌స్టార్ ఫిదా!
Super Star Shocked with Balayya NTR Getups బాలయ్య గెటప్స్ చూసి సూపర్‌స్టార్ ఫిదా!
Advertisement
Ads by CJ

కల్లాకపటం లేని సూపర్‌స్టార్‌గా కృష్ణకి ఎంతో పేరుంది. గొప్ప అందగాడు కాకపోయినా, ఆజానుబాహుడు అవ్వకపోయినా, నటనలో, డ్యాన్స్‌లలో పెద్దగా అద్భుతం కాకపోయినా కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్‌ తర్వాత మాస్‌ హీరోగా కృష్ణకి సుస్థిరస్థానం ఉందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారిని తీసుకుంటే ప్రస్తుతం బతికున్నది కృష్ణ, కృష్ణంరాజులు మాత్రమే. ఇక కృష్ణంరాజుకి పెద్దగా ఎన్టీఆర్‌తో అనుబంధం లేదనే అంటారు. కానీ కృష్ణ, ఎన్టీఆర్‌ల పరిస్థితి అది కాదు. వీరిద్దరు స్నేహితులుగా, శత్రువులుగా కూడా సెహభాష్‌ అనిపించుకుని పోటీ పడ్డారు. ఎన్టీఆర్‌ని కాదని కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చేయడం, జయాపజయాలకు అతీతంగా ‘దాన వీర శూర కర్ణ’కి పోటీగా ‘కురుక్షేత్రం’ తీసి సినిమాపరంగా కాకపోయినా టెక్నికల్‌ వ్యాల్యూస్‌ విషయంలో మాత్రం ఎన్టీఆర్‌ కంటే ముందు నిలిచిన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో సూపర్‌స్టార్‌ కృష్ణనే అని, అది ఆయనకే సాధ్యమని ఒప్పుకోవాలి. 

ఇక ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా వీరి మధ్య వైరం సాగింది. చివరకు ఎన్టీఆర్‌పై ఎన్నో వ్యంగ్యాత్మక చిత్రాలను కృష్ణ తీయడం, ఏలూరులో కాంగ్రెస్‌ తరపున ఎంపీగా నిలబడి, తెలుగుదేశం అభిమానుల చేత తీవ్ర కంటి గాయం చేయించుకున్నా అది కృష్ణకే చెల్లింది. పవర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ని ఎదిరించిన ఒకే ఒక్కడుగా ఆయన నిలిచాడు. ఇక వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహిత అనుబంధం కూడా ఉంది. కృష్ణ నిర్మించిన చిత్రాలలో ఎన్టీఆర్‌ నటించడమే కాదు.. కృష్ణ చిత్రాలు శతదినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా కూడా విచ్చేశారు. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ఆయన తనయుడు నటసింహం బాలకృష్ణ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుకకు కృష్ణని ప్రత్యేకంగా పిలవడం కోసం స్వయంగా బాలకృష్ణ కృష్ణ ఇంటికి విచ్చేయడం విశేషం. ఈ సందర్భంగా సీనియర్‌ నరేష్‌ కూడా అక్కడే ఉన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విశేషాలను కృష్ణ, బాలకృష్ణతో కలిసి ముచ్చటించారు. ఈ సినిమాలో తాను ధరించిన వివిధ గెటప్స్‌ని, వాటికి సంబంధించిన లుక్స్‌ని తన సెల్‌ఫోన్‌లో బాలయ్య కృష్ణకి చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను, విశేషాలను నరేష్‌ ట్వీట్‌ చేస్తూ, ఎన్టీఆర్‌గా వివిధ కోణాలలో బాలకృష్ణ గెటప్స్‌ చూసి కృష్ణగారు ఎంతో ఫిదా అయ్యారు. ఖచ్చితంగా ఈ బయోపిక్‌ తెలుగు సినీ చరిత్రలోనే మైల్‌స్టోన్‌ అవుతుందనే నమ్మకాన్ని కృష్ణ వ్యక్తం చేశారని నరేష్‌ తెలిపాడు. మొత్తానికి ఎన్టీఆర్‌కి కాస్త అటు ఇటుగా సమకాలీనుడైన కృష్ణని మురిపించిన ఈ గెటప్స్‌ రేపు నందమూరి అభిమానులను మరెంతగా ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సివుంది....! 

Super Star Shocked with Balayya NTR Getups:

Balayya at Super Star Krishna House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ