Advertisementt

చిన్న సినిమా టీజర్‌కు అనూహ్య స్పంద‌న

Sun 23rd Dec 2018 09:41 AM
nenu lenu movie,teaser,2m views,digital media  చిన్న సినిమా టీజర్‌కు అనూహ్య స్పంద‌న
Small Film Teaser Gets 2M Views చిన్న సినిమా టీజర్‌కు అనూహ్య స్పంద‌న
Advertisement
Ads by CJ

OSM విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఇటీవ‌లే టీజర్ విడుదలై 2 మిలియన్ డిజిట‌ల్ వ్యూస్‌ను అందుకుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను 24న, ఫిబ్రవ‌రిలో సినిమాను విడుదల చేయ‌నున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్‌కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. టీజ‌ర్‌కి 20ల‌క్షల‌ వ్యూస్ రావడం మ‌రింత నమ్మకాన్నిపెంచింది. టీజర్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చిత్రీకరణకు సంబంధించి అన్ని ప‌నులు పూర్తయ్యాయి. ఈనెల 24న ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి, ఫిబ్రవ‌రిలో సినిమాను విడుదల చేయనున్నాం. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం..’’ అన్నారు. 

Small Film Teaser Gets 2M Views:

Nenu Lenu Movie Teaser Gets 2M Views in Digital Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ