‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ షూటింగ్ పూర్తి
అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఎయిర్ టెల్ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో.. ‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా దర్శకుడు సాయికిరణ్ అడివి మాట్లాడుతూ... ‘‘సినిమాలో అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా నటిస్తోన్న ఆది సాయికుమార్ పుట్టినరోజు ఆదివారం. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది వరకు విడుదల చేసిన ఆయన లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తున్నాం. చిత్రీకరణంతా పూర్తయింది. సరికొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త లుక్‌లో చాలా కష్టపడి తెరకెక్కించాం. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.