Advertisementt

‘నేను లేను’ ట్రైలర్ వదిలారు

Mon 24th Dec 2018 06:59 PM
nenu lenu,trailer release,nenu lenu movie,harshit actor  ‘నేను లేను’ ట్రైలర్ వదిలారు
Nenu Lenu Trailer Released ‘నేను లేను’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్రం యూనిట్ విడుదల చేశారు. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఫిబ్రవరి ఒకటిన విడుదలవుతున్న ఈ చిత్రం గురించి  ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం  ఉంది. టీజ‌ర్‌కి మంచి ఆదరణ లభించింది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశాం. ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. ఫిబ్ర‌వ‌రి ఒకటిన సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం’’ అన్నారు. 

Click Here for Trailer

Nenu Lenu Trailer Released:

Nenu Lenu Trailer Release Matter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ