Advertisementt

ప్రయత్నాలు మొదలు.. చరణ్ సంగతేంటి?

Tue 25th Dec 2018 11:58 AM
ram charan,thani oruvan,sequel,remake,dhruva,mega power star,jayam ravi,jayam raja  ప్రయత్నాలు మొదలు.. చరణ్ సంగతేంటి?
Charan In The Blockbuster Sequel ప్రయత్నాలు మొదలు.. చరణ్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఓరువన్’ మూవీని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’గా చేసి సక్సెస్ అయ్యాడు. తెలుగులో ఈచిత్రాన్ని రీమేక్ చేయడానికి చాలా మంది జంకారు. విలన్ రోల్ డామినేటింగ్‌గా ఉండడంతో ఆ చిత్రాన్ని తెలుగులో చేయడానికి ఎవరు సాహసించలేదు. కానీ చరణ్ తనకు తానే ముందడుగు వేసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. 

తమిళంలో ఎంత విజయం అయితే సాధించిందో తెలుగులో కూడా అంతే విజయం సాధించిందీ చిత్రం. చరణ్ నటనలో మరో కోణాన్ని వెలికితీసింది. అయితే తమిళంలో ఇప్పుడు ‘తని ఓరువన్‌’కి సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో జయం రవి, జయం రాజా వున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని టాక్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మరి తెలుగులో కూడా ‘ధృవ’ కి సీక్వెల్ చేస్తారా? ఒకవేళ చేసినా చరణ్ హీరోగా చేస్తాడా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ‘తని ఓరువన్‌’ సీక్వెల్‌ స్టోరీ బాగుంటే చేసే అవకాశం ఉందని చెబుతున్నారు చరణ్ సన్నిహితులు. ప్రస్తుతం చరణ్.. రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాలతో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.

Charan In The Blockbuster Sequel:

Ram Charan In Thani Oruvan sequel Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ