Advertisementt

చైతూ, సామ్‌లకు కలిపి రెమ్యూనరేషన్ ఎంతంటే?

Tue 25th Dec 2018 05:01 PM
majili,naga chaitanya,samantha,remuneration,akkineni family,majili movie update  చైతూ, సామ్‌లకు కలిపి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Chaitu and Samantha Remuneration for Majili Movie చైతూ, సామ్‌లకు కలిపి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో లవ్లీ కపుల్ ఎవరు అంటే వెంటనే సమంత - నాగ చైతన్య అని చెప్పేస్తారు. చాలా ఏళ్ళు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట విడివిడిగా సినిమాలు చేస్తూ వచ్చారు. పెళ్లి తర్వాత సామ్ సినిమాలు చేయడం కష్టం అనుకున్న వారంతా ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. వరస సినిమాలు హిట్ అవ్వడంతో అమ్మడు పెళ్లి తరువాత రెమ్యూనరేషన్ పెంచడమే కాదు.. తనే నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తోంది.

పెళ్లికి ముందు చై - సామ్ విడివిడిగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అయితే పెళ్లి తరువాత ఇద్దరు కలిసి ఒకే పారితోషికం తీసుకుంటున్నారట. అవును వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘మజిలీ’ అనే  సినిమాకు జాయింట్‌గా రెమ్యూనరేషన్ అందుకున్నారు. నిర్మాత సాహు గారపాటి వీళ్లిద్దరికీ కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడట.

ఈ చెక్‌ను నాగచైతన్య డైరెక్ట్‌గా తీసుకున్నాడట. మరి ఇందులో సామ్‌కి ఎంత ఇస్తాడు అనేది వారిద్దరి మధ్య విషయం. టాలీవుడ్‌లో సమంత టాప్ హీరోయిన్ కాబట్టి 2 నుండి 3 కోట్లు వరకు తీసుకుంటుంది. చైతు 3 నుండి 4 వరకు తీసుకుంటాడు.పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు  50శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్.

Chaitu and Samantha Remuneration for Majili Movie:

Majili Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ