Advertisementt

‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ టైటిల్ భలే ఉంది కదా..!

Tue 25th Dec 2018 09:36 PM
falaknuma das,viswaksen,falaknuma das motion poster,christmas,falaknuma das movie update  ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ టైటిల్ భలే ఉంది కదా..!
Falaknuma Das Motion Poster Released ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ టైటిల్ భలే ఉంది కదా..!
Advertisement
Ads by CJ

వినూత్న‌మైన కాన్సెప్ట్‌తో స‌క్సెస్‌లు సాధించిన ‘వెళ్ళిపోమాకే, ఈ న‌గ‌రానికేమైంది’ వంటి  చిత్రాల్లో న‌టించిన విశ్వ‌క్‌సేన్ హీరోగా, స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో క‌రాటేరాజు నిర్మాత‌గా, వన్‌మాయే క్రియేష‌న్స్ పై విశ్వ‌క్‌సేన్ సినిమాస్‌, టెర‌నోవ పిక్చ‌ర్స్ అనుసంధానంతో మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’‌. ఈ సినిమా పూర్తిగా హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగే చిత్రం. ఈ చిత్రంలో స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్ర‌శాంతి లు ఫిమేల్ లీడ్ కేర‌క్ట‌ర్స్‌లో నటిస్తున్నారు. ఈ  చిత్రం 3 రోజుల మిన‌హా షూటింగ్ ని పూర్తిచేసుకుంది. పెళ్ళిచూపులు, ఈ న‌గ‌రానికేమైంది లాంటి చిత్రాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రంలో ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. క్రిష్ట‌మ‌స్ సంద‌ర్భంగా ఈరోజు ఈ చిత్రం యొక్క మెుద‌టి లుక్ ని డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.  

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత క‌రాటేరాజు గారు మాట్లాడుతూ.. ‘‘విశ్వ‌క్‌సేన్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ త‌నే హీరోగా చేస్తున్న చిత్రం ఫ‌ల‌క్‌నుమా దాస్‌. హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ‌తో క‌లిపి దాదాపు 118 లోకేష‌న్స్ లో ఈ చిత్రం షూట్ చేశాము. ఈ చిత్రం హైద‌రాబాద్ బేస్డ్ స్టోరి కావ‌టంతో ఇక్క‌డ నేటివిటి, క‌ల్చ‌ర్ ని క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాము. మా యూనిట్ అంతా చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. వారి క‌ష్టాన్ని మించి అవుట్‌పుట్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. మూడు రోజుల షూట్ మిన‌హా చిత్రం మెుత్తం పూర్త‌య్యింది. క్రిష్ట‌మ‌స్ సంద‌ర్భంగా ఈరోజు మొద‌టి లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశాము. మ‌రిన్ని వివ‌రాలు త‌్వరలోనే తెలియ‌జేస్తాము..’’ అని అన్నారు

ఈ చిత్రంలో విశ్వ‌క్‌సేన్‌, స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్ర‌శాంతి‌లు న‌టించ‌గా.. స్పెష‌ల్ పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టించారు. 

Falaknuma Das Motion Poster Released:

Falaknuma Das Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ