బోయపాటి సినిమాలు తీయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. సినిమాకి సినిమాకి గ్యాప్ తీసుకునే బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇది ఇంకా రిలీజ్ అవ్వకుండానే మరో సినిమాని లైన్ లో పెట్టేశాడు బోయపాటి.
ఈ సినిమా తరువాత బోయపాటి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందంట. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ రోజు బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ‘సింహ, లెజెండ్’ లాంటి సినిమాల తరువాత తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఫిలింనగర్ లో ప్రస్తుతం ఈ టాపికే నడుస్తుంది. అంతకుముందు బాలయ్య త్రిపాత్రాభినయం పోషించిన ‘అధినాయకుడు’ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడు బాలయ్య.