Advertisementt

‘మళ్లీ మళ్లీ చూశా’ ఫస్ట్ లుక్ వదిలారు

Thu 27th Dec 2018 11:41 PM
malli malli choosa,first look,motion poster,anurag konidena,saideva raman,malli malli choosa movie  ‘మళ్లీ మళ్లీ చూశా’ ఫస్ట్ లుక్ వదిలారు
Malli Malli Choosa First Look Released ‘మళ్లీ మళ్లీ చూశా’ ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ.. ‘‘ఒక అందమైన కలను కథగా మార్చుకుని ప్రకృతి సృష్టించుకున్న అద్భుతమైన ప్రేమ కావ్యం మా ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుంది, ఆ ప్రకృతే ఒక ప్రేమను సృష్టిస్తే ఇంకెంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమే ‘మళ్ళీ మళ్ళీ చూశా’ చిత్రం..’’ అని అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. ‘‘చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, వైజాగ్, అరకులోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా ‘మళ్లీ మళ్లీ చూశా’. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తాము..’’ అన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ ఇది..’’ అని అన్నారు.

ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని, ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల, మాటలు : హేమంత్ కార్తీక్, ఎడిటర్ : సత్య గిడుతూరి, పాటలు : తిరుపతి జావాన, కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు కొణిదెన, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.

Malli Malli Choosa First Look Released:

Malli Malli Choosa First Look, Motion Poster Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ