Advertisementt

విజయ్ కోసం 16 మంది హీరోయిన్లు

Wed 02nd Jan 2019 04:21 PM
vijay,football,heroines,16 girls  విజయ్ కోసం 16 మంది హీరోయిన్లు
16 Heroines for Vijay విజయ్ కోసం 16 మంది హీరోయిన్లు
Advertisement
Ads by CJ

విజయ్ అనగానే మన విజయ్ దేవరకొండ అనేసుకొని కంగారుపడిపోకండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది తమిళ స్టార్ హీరో విజయ్ గురించి. ఇటీవలే సర్కార్ తో యావరేజ్ హిట్ అందుకున్న విజయ్.. తన తదుపరి చిత్రంగా తనకు మెర్సల్, తెరీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా ఒకే చేసిన విషయం తెలిసిందే. ఎప్పట్లానే భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన ఏకంగా 16 హీరోయిన్లు నటించనున్నారట. ఈ పదహారుమంది కాకుండా ఓ ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా ఉండే అవకాశం ఉందట. అంటే.. రౌండ్ ఫిగర్ ఒక 18 వేసుకోండి. అంతమంది హీరోయిన్లు ఎందుకు స్వామీ అని మీరు అనుకోవచ్చు. కానీ.. అట్లీ అలా సెట్ చేశాడు. 

ఫుట్ బాల్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ ఉమెన్స్ ఫుట్ బాల్ టీం కోచ్ గా నటించనున్నాడు. ఆ టీం ప్లేయర్స్ గా కొందరు పేరున్న యువ కథానాయికలను కొందరు కొత్తమ్మాయిలను తీసుకొంటున్నారు. షారుక్ ఖాన్ కెరీర్ లో కలికితురాయిలా నిలిచిపోయిన చక్ దే ఇండియా రేంజ్ లో ఈ సినిమా కూడా ఉండబోతోందని టాక్. 

అయితే.. మన సౌత్ ఇండియాలో స్పోర్ట్స్ ఫిలిమ్స్ ను అంత ఆసక్తిగా చూడరు. ఆ కారణంగా ఈ కథలో విజయ్ కి ఒక పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ కూడా ఇస్తున్నాడట అట్లీ. హీరోకి విశేషమైన ఎలివేషన్స్ ఇవ్వడంలో డబుల్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అట్లీ.. తన ఫేవరెట్ హీరోని ఇంకెంత ప్రత్యేకంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాలా ఏంటీ. 

16 Heroines for Vijay:

Director Atlee Planning 16 Heroines for Vijay next film where he plays the role of a women football team coach

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ