తమిళనాట అజిత్ హీరోగా.. నయనతార హీరోయిన్ గా జగపతి బాబు స్టైలిష్ విలన్ గా తెరకెక్కుతున్న విశ్వాసం సినిమా మొదట్లో సంక్రాంతికి రిలీజ్ అన్నప్పటికీ.. మళ్ళీ నిన్నమొన్నటివరకు జనవరి మూడో వారంలో విడుదలవుతుందని అన్నారు. కానీ తాజాగా జనవరి 10 నే పొంగల్ కానుకగా విశ్వాసం సినిమాని విడుదల చేస్తున్నట్లుగా పోస్టర్స్ ప్రత్యక్షమవడమే కాదు... అప్పుడే మూవీ యూనిట్ విశ్వాసం ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరు చూపిస్తుంది. తమిళనాట రజినీకాంత్ పేట సినిమాకి పోటీగా అజిత్ విశ్వాసం విడుదలవుతుంది. పేట మీద ఎంతగా అంచనాలు ఉన్నాయో అజిత్ విశ్వాసం మీద కూడా అంటే అంచనాలు ఉన్నాయి.
తాజాగా విడుదలైన విశ్వాసం టీజర్ లో జగపతి బాబు, అజిత్ తో పోటీగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచేశాడు. ఇక తాజాగా అజిత్ విశ్వాసం సినిమా స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమంటే.. అజిత్, నయన తార ప్రేమలో పడి.. అనుకోకుండా విడిపోయిన వారు మళ్ళీ 12 ఏళ్ళ తరువాత ఇద్దరు ఎలా కలిశారు.. ఇక అజిత్ - నయనతారల కూతుర్ని విశ్వాసంలో విలన్ గా నటిస్తున్న జగపతి బాబు నుండి ఎలా కాపాడుకున్నారు అనేదే విశ్వాసం మెయిన్ కథగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో అజిత్ యాక్షన్, జగపతి బాబు విలనిజం, నయనతార నటన, ఆమె గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలవనున్నాయని టాక్.
మరి భారీ అంచనాల నడుమ రజినికాంత్ కి పోటీగా నిలుస్తున్న ఈ సినిమాని దర్శకుడు శివ ఏ మేర హిట్ కొట్టిస్తాడో చూడాలి. ఇప్పటివరకు శివ - అజిత్ కాంబోలో తెరకెక్కిన సినిమాలు సూపర్ హిట్స్. మరి ఇప్పుడు ఈ క్రేజీ కాంబో విశ్వాసంతో కూడా హిట్ అందుకుంటుందో... లేదో అనేది రేపు గురువారం తేలిపోనుంది.