Advertisementt

చ‌లిపూట క్రేజీ జంట ర‌హ‌స్య సంచారం!

Tue 08th Jan 2019 09:14 AM
chai,sam,samantha,naga chaitanya,majili,shiva nirvana,winter vacation,  చ‌లిపూట క్రేజీ జంట ర‌హ‌స్య సంచారం!
chai sam enjoying in nederlands చ‌లిపూట క్రేజీ జంట ర‌హ‌స్య సంచారం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్రేజీ జంట నాగ‌చైత‌న్య, స‌మంత‌. వీరిద్ద‌రి వివాహం జ‌రిగి ఏడాది పూర్తి కావ‌స్తోంది. అయినా ఇద్ద‌రు అన్యోన్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ క‌లిసి భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తున్న చిత్రం `మ‌జిలీ`. శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుండ‌గా సీతాకాలాన్ని, నులి వెచ్చ‌ని చ‌లిని నాగ‌చైత‌న్య‌, స‌మంత ఆస్వాదిస్తున్నారు. 

`మ‌జిలీ` చిత్రీక‌ర‌ణ‌కు కొంత విరామం ల‌భించ‌డంతో జంట‌గా క‌లిసి ఎంజాయ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. చిత్రీక‌ర‌ణ‌కు కొంత బ్రేక్ ల‌భించ‌డంతో ఇన్ని రోజులు నిర‌వ‌దిక షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపిన చైతూ, స‌మంత‌ కొంత విరామం ల‌భించ‌డంతో వివేశాల‌కు చెక్కేశారు. నెద‌ర్లాండ్స్‌లోని ఆమ్‌స్ట‌ర్‌డామ్ లోని  రోడ్ల‌పై అర్థ‌రాత్రి చ‌క్క‌ర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను స‌మంత త‌న సోషల్ మీడియా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో అభిమానుల‌తో పంచుకుంది. 

ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో చ‌లి చాలా ఎక్కువ‌. అయినా స‌రే న‌చ్చిన చెలి చెంత‌నుండ‌గా చ‌లిభ‌య‌మేల అనుకున్నాడో ఏమోగానీ స‌మంత‌తో క‌లిసి అర్థ‌రాత్రి న‌గ‌ర‌వీధుల్లో ఎంజాయ్ చేశార‌ట‌. బిజీలైఫ్‌తో విసిగిపోయిన ఈ జంట ఆ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం అత్యంత చ‌లిగా వుండే ఈ న‌గ‌రాన్ని ఎంచుకున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రో వారం రోజుల పాటు అక్క‌డే వుండి ఆసాంతం ఎంజాయ్ చేశాక తిరిగి ఇండియా బాట‌ప‌డ‌తాకర‌ట‌. 

chai sam enjoying in nederlands:

chai sam enjoying in winter vacation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ