Advertisementt

‘RRR’.. గాసిప్స్‌కి చరణ్ బ్రేకేశాడు

Wed 09th Jan 2019 10:23 PM
ram charan,vvr,mega power star,rrr movie,vinaya vidheya rama,ram charan role in rrr  ‘RRR’.. గాసిప్స్‌కి చరణ్ బ్రేకేశాడు
Ram Charan About His Role in RRR Movie ‘RRR’.. గాసిప్స్‌కి చరణ్ బ్రేకేశాడు
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘RRR’ రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈచిత్రంలో వారి పాత్రలు ఎలా ఉంటాయో అని అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈనేపధ్యంలో రీసెంట్ గా రామ్ చరణ్ తన పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

RRRలో చరణ్ అండ్ ఎన్టీఆర్ క్రీడాకారులుగా నటిస్తారని బాక్సర్లు అని, దొంగా పోలీస్ అని రకరకాలుగా ప్రచారం సాగుతోంది. కానీ రామ్ చరణ్ రీసెంట్ గా చెప్పిన దానితో చూస్తే ఇవేమి కాదు అని అర్ధం అయిపోయింది. ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..మరోసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నాను. ఎస్.ఎస్.రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రనే సృష్టించారు. ఈ పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఈమూవీ కోసం నేను చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. 2019 మొత్తం ఈసినిమాకు కేటాయించాను..’’ అని ఎగ్జయిటింగ్ గా చెప్పారు.

అలానే ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్ అని మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా మంచి అనుభూతిని ఇస్తాయని, ఆయనతో పని చేయడం నాకు హ్యాపీగా ఉందని చెప్పాడు చరణ్. ఇక సొంత బ్యానర్‌లో సినిమాలు గురించి ప్రశిస్తే.. అది కేవలం నాన్నగారి కోసం మాత్రమే పెట్టాను అని అన్నాడు. నాకు బయట వేరే ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతానికి నా బ్యానర్ లో వేరే హీరోని పెట్టి సినిమాలు తీసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది.

Ram Charan About His Role in RRR Movie:

Ram Charan Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ