Advertisementt

తెలుగమ్మాయికి కూడా వేడి చేసింది

Fri 18th Jan 2019 01:14 PM
eesha rebba,telugu heroine  తెలుగమ్మాయికి కూడా వేడి చేసింది
Eesha Rebba Raising the Glam Tempo తెలుగమ్మాయికి కూడా వేడి చేసింది
Advertisement
Ads by CJ

అదేంటి ఈ అమ్మాయికి వేడి చేయడం ఏంటీ, ఆరోగ్యం బాగోలేదా అని జాలిపడిపోకండి. ఇక్కడ వేడి చేయడం అంటే.. అమ్మడు వేడెక్కి, ఆ వేడితో కుర్రాళ్ళ గుండెల్ని రగిలించడం అన్నమాట. ప్రస్తుతం తెలుగమ్మాయి ఈషా రెబ్బ అదే పనిలో నిమగ్నమై ఉంది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించినా అమ్మడి జాతకంలో పెద్దగా మార్పు రాలేదు. నిజానికి ఆ సినిమాలో నటించడానికి ముందే అమ్మడి చేతిలో పుష్కలమైన చిన్న సినిమాలుండేవి. ఇప్పుడేమో పెద్ద హీరోయిన్ అయిపోయిందేమోనని చిన్న నిర్మాతలు, పెద్ద హీరోలతో మాత్రమే చేస్తుందేమోనని యువ కథానాయకులు ఈషాను అప్రోచ్ అవ్వడం మానేశారట. 

దాంతో ఆమె స్వయంగా వెళ్ళి వారిని అవకాశాలు అడగలేక, తన వద్దకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాక నానా ఇబ్బందులుపడుతోంది ఈషా. అందుకే తాను డైరెక్ట్ గా వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా సరికొత్త హాట్ ఫోటోస్ తో ఇండైరెక్ట్ మెసేజస్ పంపుతోంది. ఈషా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే.. ఎన్నడూలేని విధంగా ఈమధ్యకాలంలో గ్లామర్ డోస్ కాస్త గట్టిగా పెంచడమే కాక స్పెషల్ ఫోటోషూట్స్ కూడా చేయించుకోంటోంది. 

మరి ఈషా రెబ్బ ప్రయత్నాలు ఫలించి ఆమె అర్జెంట్ గా ఒకట్రెండు సినిమాలనైనా సైన్ చేస్తుందని ఆమె స్నేహితులు, సన్నిహితులు భావిస్తున్నారు. ఎలాగూ సెకండ్ హీరోయిన్ రోల్స్ కి కూడా ఒకే చెప్పింది కాబట్టి ఆ యాంగిల్లో ఏమైనా వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి. 

Eesha Rebba Raising the Glam Tempo:

Eesha Rebba Increasing her Glam Factor to get roles 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ