Advertisementt

‘విశ్వాసం, పెట్టా’ల పరిస్థితి ఇది?

Fri 18th Jan 2019 03:00 PM
petta,kollywood,viswasam,pongal,tamil  ‘విశ్వాసం, పెట్టా’ల పరిస్థితి ఇది?
This is the situation between petta and viswasam ‘విశ్వాసం, పెట్టా’ల పరిస్థితి ఇది?
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్టీఆర్ కథానాయుడుకు జనవరి 9 న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, రజిని పేట సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక నిన్న వచ్చిన ‘ఎఫ్-2’ సినిమా నవ్వుల సంక్రాంతిగా మార్చేసింది. వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ కడుపు చెక్కలు అయ్యేలా నవ్వించారు. విడుదల అన్ని చోట్ల ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

తమిళంలో కూడా ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రజిని పెట్టతోపాటు అజిత్ ‘విశ్వాసం’ కూడా రిలీజ్ అయింది. ఈరెండు సినిమాలు మాస్ ప్రేక్షకులని ద్రుష్టిలో పెట్టుకుని తీసినవే. అయితే పెట్ట మాత్రం మాస్ తో పాటు క్లాస్ టచ్ కూడా ఉండడంతో స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక అజిత్ సినిమా ఊర మాస్ సినిమా అన్న టాక్ వచ్చింది. కానీ రెండు సినిమాల్లోకి కొత్తదనం ఏమి లేదు.

వసూల్ విషయంలో కూడా రెండూ గట్టి పోటీపడుతున్నాయి. రెండు చిత్రాలు హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్నాయి. పండగ సెలవులు కూడా ఈసినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది కొన్ని రోజులు ఆగితే కానీ చెప్పలేం. ప్రస్తుతానికి అయితే టాక్ పరంగా రజనీ సినిమా ‘పేట’కు కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది. కలెక్షన్ పరంగా విశ్వాసం టాప్ ప్లేస్‌లో ఉంది.

This is the situation between petta and viswasam :

petta and viswaram gets hit at tamil box office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ