Advertisementt

ఎఫ్ 2 తర్వాత దిల్ రాజు టార్గెట్ ఇదే!

Fri 18th Jan 2019 08:33 PM
dil raju,maharshi movie,mahesh babu,f2 movie,target  ఎఫ్ 2 తర్వాత దిల్ రాజు టార్గెట్ ఇదే!
Dil Raju Target after F2 Movie ఎఫ్ 2 తర్వాత దిల్ రాజు టార్గెట్ ఇదే!
Advertisement
Ads by CJ

దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలామంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రాజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ళ బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే... డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో.. అలాగే దిల్ రాజుకి టైం బాలేదు కానీ... దిల్ రాజు నిర్మాణంలో కుర్ర హీరోలు నటించిన సినిమాల్ని బొల్తాకొట్టాయి. నితిన్ కానివ్వండి, రామ్ కానివ్వండి, రాజ్ తరుణ్ కానివ్వండి.. ఇలా ఏ హీరో చూసినా దిల్ రాజుకి ప్లాపులే అంట గట్టారు. అయితే హీరోల మాట ఎలా ఉన్నా.. దిల్ రాజు మాత్రం వారేదో ప్లాప్స్ లో ఉన్నారు.. వారికీ హిట్ ఇవ్వడానికే వారికోసమే సినిమా చేశానని.. దిల్ రాజు ఆయా హీరోల సినిమా ఈవెంట్స్ లో గొప్పగా మాట్లాడాడు. కానీ దిల్ రాజు గొప్పలు ఆయా హీరోల సినిమాలు ప్లాప్ అవడంతో గాలి తీసేసినట్లు అయ్యింది. 

రాజ్ తరుణ్ లవర్ తో... నితిన్ శ్రీనివాస కళ్యాణంతో, రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు దిల్ రాజుని గొప్పగా దెబ్బతీశాయి. మరి కుర్ర హీరోలు ప్లాపులిస్తేనేమిటి... ఇప్పుడు సీనియర్ హీరో దిల్ రాజుకి మంచి  హిట్ అందించాడు. కుర్ర హీరో వరుణ్ తేజ్ - సీనియర్ హీరో వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఎఫ్ 2  ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా.. శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరుణ్ కామెడీ కన్నా ఎక్కువగా.. వెంకటేష్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనేది ఎఫ్ టు టాక్ తోనే తెలుస్తుంది. ఎఫ్ టు సినిమాకి ప్రేక్షకుల నుండి రివ్యూ రైటర్స్ నుండి పాజిటివ్ మార్కులు పడ్డాయి.

అందులోను వెంకీ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అంటున్నారు. మరి గత ఏడాది కుర్ర హీరోలు ప్లాపులిస్తే ఏమిటి ఈ ఏడాది మొదట్లోనే దిల్ రాజుకి ఎఫ్ టు తో వెంకటేష్ మంచి హిట్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ఈ ఎఫ్ టు తో మంచి హిట్ కొట్టేశాడు. ఇక ఈ ఏడాది ఎఫ్ టు తో హిట్ అందుకున్న దిల్ రాజు.. మహేష్ తో చేస్తున్న మహర్షి సినిమాతో కూడా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.

Dil Raju Target after F2 Movie:

Dil Raju Eye on Mahesh Babu Maharshi Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ