Advertisementt

వీరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది!

Sun 20th Jan 2019 02:35 PM
rakul preet singh,chinmayi,netizen,comments,serious  వీరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది!
Chinmayi Serious on Netizen వీరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది!
Advertisement
Ads by CJ

తాజాగా స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పొట్టి నిక్కర్లో కారు నుంచి దిగుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ఓ నెటిజన్‌ వికృతమైన కామెంట్స్‌ చేశాడు. ‘పని’ కానిచ్చేసి.. ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిందని అంటూ ఆమెని ‘లం.. (బిచ్‌)’ అని సంబోధించాడు. దానిపై రకుల్‌ మండిపడింది. నీ తల్లి కూడా అలా చేస్తుంది కాబట్టే నువ్వు అలా ఆలోచిస్తున్నావంటూ ఘాటుగా స్పందించింది. దీంతో కొందరు నెటిజన్లు ఆ కామెంట్‌ చేసిన వ్యక్తిని విమర్శిస్తే బాగుండేది కానీ ఆమధ్యలో ఆమె తల్లి నీకేం చేసింది? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

ఇక విషయానికి వస్తే ‘మీటూ’ ఉద్యమంలో వైరముత్తు ఎపిసోడ్‌తో పాటు పలువురు పెద్దల భాగోతాలు బయటపెట్టిన గాయని చిన్మయి ఈ విషయంలో మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేసింది. నన్ను కారణం లేకుండా తిట్టిపోస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడే నాకు సోషల్‌మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సోషల్‌ మీడియాలో మనల్ని ఇలా విమర్శించడానికి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారు అసభ్యంగా మాట్లాడుతున్నప్పటికీ మనం సౌమ్యంగా ఉండాలి. ఇలాంటి మూర్ఖుల్ని మనం ‘అన్నా, సార్‌’ అని సంబోధించాలి. ఇలాంటి వారు ఎందుకు ప్రాణాలతో ఉంటారో నాకు అర్ధం కావడం లేదు. నేను ఓ గాయనిని అయినప్పటికీ నన్ను అత్యాచారం చేస్తామని, చంపేస్తామని పలువురు బెదిరిస్తూ మెయిళ్లు, ట్వీట్స్‌ పెడుతున్నారు.

మహిళలని తమకి ఇష్టం వచ్చినట్లు అనడానికి, చేయడానికి పురుషులకు రాసేసి ఇచ్చినట్లు పలువురి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఈ విషయంలో ట్విట్టర్‌ ఏమీ చేయలేదు. పోలీసులకు భారం ఎక్కువైపోతోంది. నాకు, రకుల్‌ప్రీత్‌సింగ్‌కి, ఇతర నటీమణులకు ఇలా రోజూ వచ్చే ఇలాంటి చెత్త సందేశాలను షేర్‌ చేస్తే అందులో మీరు కొట్టుకుపోతారు. సమాజం మారింది కానీ ఇంకా మారాలి. మహిళలు ఓపికగా ఉండాలి’ అంటూ ఎంతో ఆవేదనతో కూడిన స్పందన తెలియజేసింది. 

Chinmayi Serious on Netizen:

Netizen Comments on Rakul and Chinmayi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ