నాని సినిమాలు ఫ్లాపవ్వచ్చు కానీ.. యాక్టర్ గా మాత్రం మనోడు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అయితే.. ఈమధ్యకాలంలో హిట్టయిన సినిమాల్లో నాని పెర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ రిపీటెడ్ గా ఉంటుందని టాక్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. అందుకే.. తన పంధాను కాస్త మార్చి రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా జెర్సీ అనే ప్రొజెక్ట్ ను సెలక్ట్ చేసుకొన్నాడు నాని. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాక సినిమాపై అంచనాలను కూడా క్రియేట్ చేసింది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ ద్విపాత్రాభినయం అన్నాతమ్ముళ్ళుగానే లేక తండ్రీకొడుకులుగానా అనేది తెలియాల్సి ఉండగా.. నాని ఇదివరకు ద్విపాత్రాభినయం పోషించిన జెండాపై కపిరాజు డిజాస్టర్ గా నిలిచి ఉండడంతో నాని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. నాని సరసన కన్నడ నటీమణి శ్రద్ధా శ్రీనాధ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ క్రికెట్ కోచ్ గా కీరోల్ ప్లే చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత నాని అవసరాల శ్రీనివాస్, మోహన్ కృష్ణ ఇంద్రగంటిల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు. 2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక రెండు సినిమాలు విడుదల చేసి.. వాటితో సూపర్ హిట్స్ కొట్టాలన్న ప్లాన్ తో ఉన్నాడు నాని. మరి అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.