Advertisementt

అక్ష‌య్‌ని వ‌ద‌ల‌నంటున్న శంక‌ర్‌!

Tue 22nd Jan 2019 07:23 PM
akshay kumar,shankar,bharateeyudu,bharateeyudu-2,kamal haasan,kajal agarwal,abhishek bachchan  అక్ష‌య్‌ని వ‌ద‌ల‌నంటున్న శంక‌ర్‌!
akshay kumar in bharateeyudu-2 అక్ష‌య్‌ని వ‌ద‌ల‌నంటున్న శంక‌ర్‌!
Advertisement
Ads by CJ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన రోబో సీక్వెల్ `2.ఓ`లో బాలీవుడ్ హీరో అక్ష‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా తెలుగు త‌మిళ భాష‌ల్లో భారీ విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలో ర‌జ‌నీ పాత్ర కంటే అక్ష‌య్ పోషించిన ప‌క్షిరాజు పాత్ర‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఆ పాత్ర‌నే అంతా ఆస్వాదించారు కూడా. ఈ సినిమా ఫ‌లితం, క‌లెక్ష‌న్‌లు ఎలా వున్నా అక్ష‌య్‌కుమార్ మాత్రం త‌న ప్రొఫెష‌న‌లిజంతో శంక‌ర్‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాడ‌ట‌. అక్ష‌య్ సిన్సియారిటీకి, డెడికేష‌న్‌కు ముగ్ధుడైన శంక‌ర్ అత‌నికి మ‌రో సినిమాలోనూ అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలిసింది. ``2.ఓ` ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందించ‌క‌పోవ‌డంతో కసితో వున్న శంక‌ర్ త‌దుప‌రి చిత్రంగా `భార‌తీయుడు` చిత్రానికి సీక్వెల్‌గా `భార‌తీయుడు-2` చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే.

 క‌మ‌ల్‌హాస‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆయ‌న‌కు జోడీగా న‌టిస్తోంది. ఈ నెల 18న మొద‌లైన ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ మ‌రోసాని సేనాప‌తిగా క‌నిపించ‌బోతుండ‌గా విల‌న్‌గా అక్ష‌య్‌కుమార్ క‌నినిపించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. అక్ష‌య్‌తో పాటు మ‌రో బాలీవుడ్ వార‌సుడు  అమితాబ్‌ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని, ఇప్ప‌టికే శంక‌ర్ అత‌న్ని సంప్ర‌దించార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `2.ఓ` ఫేమ్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్న ఈ సినిమా మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశం వుంద‌ని నేటి రాజ‌కీయాల‌ని ఎండ‌గ‌డుతూ శంక‌ర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ని త‌మిళ‌ చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి.

akshay kumar in bharateeyudu-2:

shankar ropes akshay kumar once more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ