Advertisementt

RRR.. వాళ్లెక్కడ రాజమౌళి..?

Tue 22nd Jan 2019 08:12 PM
rajamouli,rrr movie,second schedule,ram charan,jr ntr,heroines  RRR.. వాళ్లెక్కడ రాజమౌళి..?
RRR Second Schedule Starts RRR.. వాళ్లెక్కడ రాజమౌళి..?
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి తీసే ప్రతి సినిమాలో హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరిలా హీరోయిన్స్ ను డ్యూయెట్స్ వరకే పరిమితం చేయకుండా వారికంటూ ఓ ప్రత్యేక స్థానం ఇస్తుంటాడు రాజమౌళి. మగధీరలో కాజల్...ఈగలో సమంత...బాహుబలిలో అనుష్క, తమన్నా అయినా వారికంటూ ఇంపార్టెన్స్ ఉంటుంది.

అయితే RRR లో మాత్రం హీరోయిన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదని టాక్. RRR మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల పైనే షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం నుండి రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది.. ఇందులో కూడా హీరోయిన్స్ లేరు. కేవలం హీరోలపైనే తీస్తున్నట్టు సమాచారం.

అందుకే రాజమౌళి హీరోయిన్స్ ని ఇంకా ఎంపిక చేయలేదని టాక్. ఒకవేళ ఉన్నా అంత పెద్ద ప్రాముఖ్యత వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మూడో షెడ్యూల్ నుండి వీరి పాత్రలు ఉంటాయని అంటున్నారు. హీరోయిన్స్‌లో ఒకరుగా కీర్తి సురేష్ పేరు బాగా వినిపిస్తోంది.

RRR Second Schedule Starts:

No Clarity on RRR Heroines

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ