Advertisementt

‘ఎఫ్ 2’, ‘విశ్వాసం’తో హిట్టుకొట్టిన తెలుగు రైటర్

Thu 24th Jan 2019 12:15 AM
aadi narayana,writer,f2 movie,viswasam movie,telugu writer,aadinarayana  ‘ఎఫ్ 2’, ‘విశ్వాసం’తో హిట్టుకొట్టిన తెలుగు రైటర్
Telugu Writer gets Hit with F2 and Viswasam ‘ఎఫ్ 2’, ‘విశ్వాసం’తో హిట్టుకొట్టిన తెలుగు రైటర్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి తెలుగులో ‘ఎఫ్ 2’, త‌మిళ్‌లో ‘విశ్వాసం’ చిత్రాల‌తో ఒకేసారి సూప‌ర్ హిట్స్ సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు రచయిత ఆదినారాయణ. తెలుగులో ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2’ చిత్రాల‌కు... త‌మిళ్‌లో ‘వీర‌మ్, వేదాళ‌మ్, వివేగం, విశ్వాసం’ చిత్రాల‌కు రైట‌ర్‌గా వ‌ర్క్ చేసి వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన తెలుగు రైట‌ర్ ఆదినారాయ‌ణ‌. ఓ వైపు తెలుగు, మ‌రో వైపు త‌మిళ్.. రెండు భాష‌ల్లో త‌ను వ‌ర్క్ చేసిన చిత్రాలు ఘనవిజయాలు సాధించ‌డంలో ర‌చ‌యిత‌గా కీల‌క పాత్ర పోషించారు ఆయ‌న‌. దీంతో ఆదినారాయ‌ణ తెలుగు, త‌మిళ్ రెండు భాషా చిత్రాల‌లో బిజీ అయ్యారు.

 ఆదినారాయ‌ణ స్వగ్రామం అమ‌లాపురం ద‌గ్గర ఈద‌ర‌ప‌ల్లి. చిన్నప్పటి నుంచి ఆయ‌న‌కు సినిమాలంటే పిచ్చి. హీరో గోపీచంద్ ‘ఒంట‌రి’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్ చేసారు. ఆయ‌న ద్వారా డైరెక్టర్ ‘శౌర్యం’ శివ ప‌రిచ‌యం అవ్వడంతో ‘ద‌రువు’ సినిమాకి వ‌ర్క్ చేసారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘బంగారం’, అల్లరి న‌రేష్ ‘సుడిగాడు’, క‌ళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఎ’ మూవీకి రచయితగా పని చేశారు. ‘ల‌క్ష్మీ’, ‘కృష్ణ‌’, ‘నాయ‌క్’ చిత్రాల ర‌చ‌యిత‌ ఆకుల శివ ద‌గ్గర ఆదినారాయ‌ణ వ‌ర్క్ చేసారు.

 ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తదుపరి చిత్రానికి, ‘శౌర్యం’ శివ త‌దుప‌రి చిత్రానికి, కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే మూవీకి వ‌ర్క్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లో విభిన్న క‌థల‌తో తెలుగు ర‌చ‌యిత ఆదినారాయ‌ణ‌ వ‌రుస విజ‌యాలు సాధిస్తుండ‌డం అభినంద‌నీయం. రచయితగా తనకు ప్రోత్సాహం అందిస్తున్న అందరికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు ఆదినారాయణ.

Telugu Writer gets Hit with F2 and Viswasam:

Writer Aadi Narayana get Success in Telugu and Tamil 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ