Advertisementt

పవన్‌ను బీట్ చేసిన రామ్ చరణ్

Thu 24th Jan 2019 03:08 PM
vinaya vidheya rama,agnathavasi,ram charan,beat,pawan kalyan  పవన్‌ను బీట్ చేసిన రామ్ చరణ్
Ram Charan beat Power Star Pawan Kalyan పవన్‌ను బీట్ చేసిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అందులో చరణ్ నటించిన బోయపాటి డైరెక్ట్ చేసిన ‘వినయ విధేయ రామ’ రిలీజ్ అయింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు వసూల్ ఎలా ఉన్నా కంటెంట్ మీద, బోయపాటి మీద, రామ్ చరణ్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అయిపోయాయి.

ఈ మూవీ రిలీజ్ అయ్యి పది రోజులు పైనే అవుతుంది. డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈసినిమా ఇప్పటి వరకు రూ. 61 కోట్లు రాబట్టిందని దక్కించుకుందని టాక్. ఒకరకంగా చెప్పాలంటే ఇది అరుదైన విషయమే. మరోసారి చరణ్ స్టామినా ఏంటో రుజువు అయింది. ‘అజ్ఞాతవాసి’  లాంటి సినిమానే రూ. 50 కోట్ల లోపే ముగిసిందని ఈ లెక్కన బాబాయ్‌ని అబ్బాయ్ క్రాస్ చేసినట్లే అని ట్రేడ్ చెబుతుంది.

అయితే ఈ లెక్కలన్నీ కరెక్ట్ కాదని 90 కోట్లకు అమ్ముడైన ‘వినయ విధేయ రామ’ కేవలం 38 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అని... మొత్తం నష్టం 50 కోట్లకు పైనే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు చెప్పే వసూళ్ల లెక్కల్లో ఇవాళా రేపూ విశ్వసనీయతలు ఉండడం లేదు కనుక.. ఎవ్వరి కాలిక్యులేషన్లనీ కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. చూద్దాం ఏమి జరుగుతుందో.

Ram Charan beat Power Star Pawan Kalyan:

Vinaya Vidheya Rama Beat Agnathavasi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ