నేచురల్‌స్టార్ నాని సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వరుసగా చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ ద్విపాత్రిభినయం చేసేస్తున్నాడు. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ ల కలయికలో బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె సంయుక్తంగా నిర్మించిన చిత్రం `డీ ఫర్ దోపిడి`. ఈ సినిమాకు భాగస్వామిగా తొలి అడుగు వేసిన నేచురల్ స్టార్ కొంత విరామం తరువాత `అ!` చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా తన అభిరుచి ఏంటో చెప్పేశాడు. తొలి ప్రయత్నంతో నిర్మాతగా మంచి మార్కులే స్కోర్ చేసిన నాని ఆ స్థాయిలో మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయాడు.
త్వరలో నాని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం`మళ్లీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోరూపొందుతున్న `జర్సీ` చిత్రంలో నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో నాని పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమా తరువాత విక్రమ్ కె, కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్న నాని త్వరలో రెండు చిత్రాలకు భాగస్వామిగా వ్యవహరించబోతున్నారు..
తనే హీరోగా నటించనున్న ఈ రెండు చిత్రాల్లో ఒక సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. దీనికి ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించనున్నారని తెలిసింది. మరో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు నిర్మాతలతో నాని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇవి త్వరలోనే సెట్స్‌మీదికి రానున్నాయని తెలిసింది.