కంగనా రనౌత్ మెయిన్ లీడ్‌లో నటించి 30 శాతం డైరెక్షన్ చేసిన మణికర్ణిక సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో మొదలైన మణికర్ణిక సినిమా చివరిలో కంగనా చేతుల్లోకొచ్చింది. క్రిష్ కొన్నికారణాలతో మణికర్ణికా దర్శకత్వం నుండి తప్పుకోవడంతో.. కంగనా మణికర్ణిక డైరెక్షన్ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. ఇక అప్పటినుండి సినిమా మొత్తం తానే డైరెక్షన్ చేసినట్లుగా కంగనా బిల్డప్ ఇస్తుంది. క్రిష్ కి థ్యాంక్స్ అంటూ నామ మాత్రంగా టైటిల్ లో క్రిష్ పేరు వేస్తుంది కానీ.. అది మనస్ఫూర్తిగా చెయ్యలేదు. ఇక దర్శకుడు క్రిష్ కూడా చాలా రోజుల తర్వాత కంగనా గురించి మాట్లాడకుండా సోనూసూద్ ఆ సినిమా నుండి బయటికొచ్చేయడం... అనేది సోనూసూద్ తప్పు కాదని.. అంతా కంగనాదే తప్పు అనే అర్ధం వచ్చేలా మాట్లాడాడు.
ఇక తాజాగా సినిమా విడుదల దగ్గరపడే కొద్దీ రాష్ట్రపతికి, ఇంకా చాలామంది ప్రముఖులకు తన మణికర్ణిక సినిమాని స్పెషల్ షోస్ వేసి మరీ చూపిస్తుంది కంగనా. ఇక సినిమా చూసిన ప్రతిఒక్కరు కంగానా నటనను, డైరెక్షన్‌ను తెగ పొగిడేస్తున్నారు. ఇక తన డైరెక్షన్ మీద వస్తున్న పొగడ్తలను బాగా ఎంజాయ్ చేస్తున్న కంగనా.. కేవలం ముప్పై శాతమే దర్శకత్వం చేసింది. మిగిలిన 70 శాతం క్రిష్ డైరెక్షన్ చేసిన మణికర్ణికకు.. అస్సలు క్రిష్ పేరు ఎక్కడ వినబడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కనీసం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా క్రిష్ కి ఎక్కడా కృతజ్ఞత కూడా చెప్పడం లేదు.
ఇక మణికర్ణిక రైటర్ టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్ కూడా కంగనా డైరెక్షన్ గురించి కథలు కథలుగా చెబుతున్నాడు కానీ.. క్రిష్ ముచ్చట మాత్రం తియ్యడం లేదు. మరి కంగనాకున్న ఈ నియంతృత్వ పోకడని భరించలేకే క్రిష్ చల్లగా మణికర్ణిక డైరెక్షన్ బాధ్యత నుండి తప్పుకున్నట్టుగా స్పష్టమవుతుంది. పాపం ఏడాది కాలం క్రిష్.. మణికర్ణిక కోసం పడిన కష్టం అంతా కంగనా ఓవర్ యాక్షన్ లో పడి కొట్టుకుపోయింది. పాపం క్రిష్ ఇక్కడ... ఎన్టీఆర్ కథానాయకుడు దెబ్బకి విలవిలలాడుతుంటే.. అక్కడ మణికర్ణికా గోలొకటి.