Advertisementt

నాని కోసం విక్ర‌మ్ కొత్త భామ‌ని ప‌ట్టేశాడా!

Sun 27th Jan 2019 06:29 PM
priya akash,priya prakash varrier,oru adar love,lovers day,nani,vikram k kumar  నాని కోసం విక్ర‌మ్ కొత్త భామ‌ని ప‌ట్టేశాడా!
priya akash next with nani film నాని కోసం విక్ర‌మ్ కొత్త భామ‌ని ప‌ట్టేశాడా!
Advertisement
Ads by CJ

`మ‌ళ్లీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని ప్ర‌స్తుతం `జెర్సీ` చిత్రంలో న‌టిస్తున్నాడు. క్రికెట్ నేప‌థ్యంలో పిరియాడిక్ లుక్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుండ‌గా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఫిబ్ర‌వ‌రి 19న ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం విక్ర‌మ్ కుమార్ కొత్త భామ‌ని సెలెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కొత్త పంథాలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా మ‌ల‌యాళ హాట్ ఫేవ‌రేట్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను హీరోయిన్‌గా విక్ర‌మ్ కుమార్ ఖారారు చేసే ప‌నిలో వున్న‌ట్టు తెలిసింది. 

మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఇంకా విడుద‌ల కాని ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 14న తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని గురురాజ్‌తో క‌లిసి వినోద్‌రెడ్డి విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన ప్రియా ఆకాష్‌ని త‌మ సినిమాలో న‌టింప‌జేయాల‌ని చాలా మంద నిర్మాత‌లు ప్ర‌య‌ల్నాలు చేశార‌ట‌. 

ఎవ‌రికీ ఓకే చెప్ప‌ని ప్రియా తాజాగా విక్ర‌మ్ కుమార్‌కు ఓకే చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ తొలి సినిమా నానీదే అయితే టాలీవుడ్‌లో ఇక అమేకు తిరుగులేద‌న్న‌ట్టే. వ‌న్స్ నాని సినిమా మొద‌లైతే తెలుగులో ప్రియా ఆకాష్ వారియ‌ర్‌కు అఫ‌ర్‌ల వెల్లువ మామూలుగా వుండ‌ద‌ని తెలుస్తోంది. ఓ ప‌క్క అల్లు అర్జున్ కూడా ప్రియ‌కు త‌న సినిమాలో అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నారు. అదే జ‌రిగితే ఈ మ‌ల‌యాళీ భామ‌కు టాలీవుడ్ ఇక రెడ్ కార్పెట్ ప‌రవ‌డం ఖాయ‌మే.

priya akash next with nani film:

priya akash next telugu film with nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ