Advertisementt

ఈ విషయంలో అల్లుఅర్జున్‌ని కొట్టేవారే లేరు

Wed 30th Jan 2019 06:17 PM
allu arjun,duvvada jagannadham,dil raju,records,youtube,dubbing movies,bunny,stylish star allu arjun  ఈ విషయంలో అల్లుఅర్జున్‌ని కొట్టేవారే లేరు
No One Can Beats Allu Arjun in this record ఈ విషయంలో అల్లుఅర్జున్‌ని కొట్టేవారే లేరు
Advertisement
Ads by CJ

పొరుగింటి పుల్లకూర రుచి.. అనే సామెత నిజంగా అక్షరసత్యం. మనం ఇంతకాలం బాలీవుడ్‌లో వస్తున్న విభిన్న చిత్రాలు, ‘దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ వంటివి మన భాషలో ఎందుకు రావని బాధపడేవారం. ఇక తమిళం, మలయాళం, కన్నడ భాషలో వచ్చే ప్రయోగాత్మక చిత్రాలు, అవార్డు సినిమాలు మన వారు తీయలేకపోతున్నారని బాధపడుతున్నాం. కానీ అదేమి విచిత్రమో గానీ ఇటీవల పక్కా మాస్‌, యాక్షన్‌ చిత్రాలు, మనం రొంపకొట్టుడు పక్కా మాస్‌ చిత్రాలు అని విమర్శించే వాటిని ఇతర భాషల వారు శాటిలైట్‌, యూట్యూబ్‌, డిజిటల్‌ ఫార్మాట్స్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. 

దీనికి ఉదాహరణ తెలుగులో సరిగా ఆడని పక్కాకమర్షియల్‌, హైఓల్టేజ్‌ యాక్షన్‌, భారీ చిత్రాలు మలయాళంలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి చిత్రాల ద్వారానే స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ అంటే మలయాళీలు పడి చచ్చిపోతూ ఉండటమే కాదు.. ఆయనను మల్లూ అర్జున్‌ అని పిలుచుకుంటున్నారు. ఆయన డబ్బింగ్‌ చిత్రం మలయాళంలో విడుదల అవుతోందంటే అక్కడి స్ట్రెయిట్‌ చిత్రాల వారు కూడా భయపడుతుంటారు. 

తెలుగు చిత్రాలకు తమిళ, కన్నడ రాష్ట్రాలలో కూడా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇక ‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలపై బాలీవుడ్‌ కన్నుకూడా పడింది. దీనికి ఉదాహరణ.. పక్కా రొటీన్‌ చిత్రాలుగా భావించిన బన్నీ ‘సరైనోడు, దువ్వాడజగన్నాధం(డిజె)’లు. ‘సరైనోడు’ చిత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే 25 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

ఇక తాజాగా ‘డిజె’ హిందీ వెర్షన్ ‌‘డిజె’ను దిల్‌రాజు తన అధికార యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఇప్పటివరకు 50మిలియన్ల వ్యూస్‌ని సాధించింది. ఈ చిత్రాన్ని గోల్డ్‌మైన్‌ టెలిఫిలిమ్స్‌ వారు తమ అధికార యూట్యూబ్‌లో పెడితే, 72 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.

No One Can Beats Allu Arjun in this record:

Allu Arjun Movies Creates Records in Youtube

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ