Advertisementt

షాక్‌లో ‘మహర్షి’ టీమ్.. కీలక సన్నివేశం లీక్!

Wed 30th Jan 2019 08:13 PM
maharshi,video leaked,strict resolution,dil raju,mahesh babu,super star,maharshi leaked  షాక్‌లో ‘మహర్షి’ టీమ్.. కీలక సన్నివేశం లీక్!
Maharshi Pics, Video Leaked Online షాక్‌లో ‘మహర్షి’ టీమ్.. కీలక సన్నివేశం లీక్!
Advertisement
Ads by CJ

మహేష్ - వంశీ పైడిపల్లి కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ షెడ్యూల్ తాజాగా పొల్లాచ్చిలో పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్రలో మహేష్‌కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఒక బడా కంపెనీ సీయివో గాను.. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నాడనే  ప్రచారం జరుగుతుంది. తాజాగా మహర్షిలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో లీకై సెన్సేషనల్ గా వైరల్ అయ్యాయి.

పొలాచ్చిలో పల్లెటూరి వాతావరణంలో పంట పొలాల మధ్య ఉన్న మహేష్.. మీడియాతో మాట్లాడుతూ ఉన్న షూటింగ్ ఫొటోతో పాటుగా.. ఒక వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  ఓ సీన్ షూట్‌ చేస్తున్న వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. పల్లెటూరి ప్రాంతంలో షూటింగ్ జరుపుతుండడంతో మహేష్ ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్‌ సన్నివేశాలను వీడియో తీసి ఫొటోస్ రూపంలోనూ ఆ వీడియో ని కూడా నెట్ లో పెట్టేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎంతో కీలకమైన సన్నివేశాలు ఇలా ఇంటర్నెట్ లో రావడం చూసిన మహర్షి టీం షాకైందట. 

అయితే ఎప్పటికప్పుడు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటివి లీకేజ్ విషయాలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. సెట్ లో సెల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా.. కొన్నిసార్లు హీరోల అభిమానులే ఇలా తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ ని సెల్ ఫోన్ లో బందించి లీక్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ లీకేజ్ పై మహర్షి టీం టెంక్షన్ తో పాటుగా గుర్రుగా ఉందని తెలుస్తుంది. 

Maharshi Pics, Video Leaked Online:

Maharshi Video Leaked, Strict Resolution 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ