Advertisementt

వరుణ్ తేజ్ విలన్.. హీరో ఇతనే..!!

Fri 01st Feb 2019 11:25 PM
varun tej,villain,sri vishnu,valmiki movie  వరుణ్ తేజ్ విలన్.. హీరో ఇతనే..!!
Hero Fixed for Valmiki Movie వరుణ్ తేజ్ విలన్.. హీరో ఇతనే..!!
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌, బాలీవుడ్‌ల పరిస్థితి వేరు. అక్కడ హీరోని ఎలివేట్‌ చేయడం కోసం ఇతర పాత్రల ప్రాధాన్యం తగ్గించడం, మంచి స్టార్స్‌ చేత నెగటివ్‌ షేడ్స్‌ ఉన్నపాత్రలు చేయాల్సి వచ్చినా, హీరో పాత్రలకు కూడా సరైన గుర్తింపును ఇచ్చేవిధంగా చేయడం వారికి అలవాటు. ‘బాజీగర్‌, డర్‌’లతో పాటు ఎన్నో చిత్రాలు దీనిని నిరూపించాయి. ఇక తమిళంలో కూడా ‘జిగర్‌తాండా’ చిత్రాన్నే తీసుకుంటే ఈ చిత్రం ద్వారా సాక్షాత్తు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సన్‌ పిక్చర్స్‌ వంటి వారిని మెప్పించి, ‘పేట’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌కి వచ్చింది. 

‘జిగర్‌తాండా’లో హీరో, విలన్‌ ఇద్దరిదీ సమానమైన రోల్‌. హీరో సిద్దార్ద్‌తో పాటు విలన్‌గా, డాన్‌గా నటించిన బాబీ సింహాది కూడా సరిసమానమైన పాత్ర. ముఖ్యంగా ఇందులో క్రూరమైన విలనిజాన్ని చూపిస్తూ మొదటి షాట్‌లోనే ఓ వ్యక్తిని సజీవ దహనం చేస్తూ బాబీ సింహా చూపించిన నటన అద్భుతం. కాగా ఇప్పుడు ఈ చిత్రం రీమేక్‌ తెలుగులో 14రీల్స్‌ నిర్మాణంలో ‘గబ్బర్‌సింగ్‌’ వంటి రీమేక్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టిన హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. 

అయితే తమిళంలో కంటే తెలుగులో దీనికి పలు మార్పులు చేర్పులు చేయనున్నారట. డాన్‌ పాత్రను పోషిస్తున్న వరుణ్‌తేజ్‌ని హైలైట్‌ చేసే దిశగా టైటిల్‌ని కూడా ‘వాల్మీకి’ అని పెట్టారు. హీరో పాత్రకు ప్రాధాన్యం తగ్గించేందుకు నిర్ణయించారు. మొదట్లో తమిళంలో నటించిన సిద్దార్ద్‌నే తెలుగులోకి కూడా తీసుకోవాలని భావించారు. కానీ సిద్దార్ద్‌ ఈ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపలేదు. 

దాంతో ‘అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్‌ మదిలో’ వంటి పలు చిత్రాలతో తన సత్తా చాటిని శ్రీవిష్ణుని సిద్దార్ద్‌ పాత్రకి ఎంచుకున్నారు. సో.. శ్రీవిష్ణుకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఈ చిత్రం రూపొందనుందని అర్ధమవుతోంది. 

Hero Fixed for Valmiki Movie:

Varun Tej Villain and Sri Vishnu Hero in Valmiki

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ