Advertisementt

పాల్ పై వర్మ పగ పట్టాడు

Sun 03rd Feb 2019 01:30 PM
ram gopal varma,ka paul,revenge,praja shanti party  పాల్ పై వర్మ పగ పట్టాడు
Ram Gopal Varma Movie on KA Paul పాల్ పై వర్మ పగ పట్టాడు
Advertisement
Ads by CJ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూటే సపరేట్‌.. ఆయన ఎవరినైనా హర్ట్‌ చేసి ఇగో రెచ్చగొడుతాడు. దానిలో ఆనందాన్ని, పబ్లిసిటీని వెతుక్కుంటాడు. కానీ తనపై ఈగ వాలినా, ఎవరైనా తప్పు మాట్లాడినా ఆయన ఇగో ప్రపంచంలో ఎవ్వరినీ హర్ట్‌ చేయని విధంగా చేస్తుంది. దాంతో వారిపై అస్త్రశస్త్రాలు, సెటైర్లు, కామెంట్స్‌, ఇంకా వీలుంటే వారిని తన చిత్రాలలో బఫూన్లుగా, విలన్లుగా కూడా చూపించడానికి వెనుకాడడు. మొదట ఆయన మెగా హీరోలపై, మెగాబ్రదర్‌ నాగబాబు నుంచి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ వంటి వారిపై కూడా పూర్తి స్థాయి సెటైర్లు వేశాడు. మెగాభిమానులను రెచ్చగొట్టి తన కడుపుమంటను చల్లార్చుకుని, గుడిసెకి నిప్పు పెట్టి చలికాచుకున్నాడు. ఆ వెంటనే బాలయ్య మీద పడ్డాడు. 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి పార్ట్‌గా వచ్చిన ‘కథానాయకుడు’ ఫ్లాప్‌ కావడంతో ‘మహానాయకుడు’ విడుదల తేదీ ప్రకటించిన 24 నిమిషాలలోనే తన ‘లక్ష్మీస్‌ఎన్టీఆర్‌’ ట్రైలర్‌ని విడుదల చేస్తానని, అలా విడుదల చేయమని ఎన్టీఆర్‌ తనని హెచ్చరించాడని తెలిపాడు. ఇక ఈసారి ఆయన నేరుగానే నందమూరి కుటుంబం, నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్‌ చేయడం ప్రారంభించాడు. ‘లక్ష్మీస్‌ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ వంటి వారిని విలన్లుగా చూపించడం ఖాయమని తేలిపోతోంది. 

ఇక ఇప్పుడు తాజాగా ఆయన కె.ఎ.పాల్‌పై పడ్డాడు. ఎలక్షన్ల ముందు ప్రజాశాంతి పార్టీ పెట్టి హడావుడి చేసే పాల్‌ తన క్రైస్తవ మత ప్రచారకుడు నుంచి పొలిటీషన్‌ అవతారం ఎత్తాడు. వచ్చేఎన్నికల్లో తాను గెలుస్తానని, ఐదేళ్లలో ఏపీని అమెరికాలో తయారు చేస్తానని చెప్పుకుంటున్నాడు. ఇదే సమయంలో పాల్‌ వర్మని బాగా కెలికాడు. వర్మ తన కాళ్లు పట్టుకున్నాడని చెప్పాడు. దాంతో తాను కాళ్లు పట్టుకుని లాగాలని, అలా పాల్‌ పడిపోతే ఆయన మెదడు మరలా బాగవుతుందనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని వర్మ సెటైర్‌ విసిరాడు. 

మరోపక్క పాల్‌ పాడిన ఓ పాటను పోస్ట్‌ చేసి అందరిలో నవ్వులు పంచి పాల్‌ని ఆటాడుకున్నాడు. ఇక జీసస్‌ నాకు చెప్పాడు.. పాల్‌కి ఒక్క సీటు కూడా రాదంట.. అంటూ సెటైర్‌ వేశాడు. ఇక తాజాగా కె.ఎల్‌.పాల్‌ మీద తన చిత్రంలో ఓ పాత్రని గానీ, లేదా ఆయన బయోపిక్‌ని గానీ తీయాలని, ఇందులో పాల్‌ని జోకర్‌గా చూపించాలని వర్మ డిసైడ్‌ అయ్యాడు. మరి వర్మ అనుకున్నంత పని చేయడం ఖాయం. దీంతో పాల్‌కి పోయి పోయి వర్మతో ఎందుకు పెట్టుకున్నానురా! బాబోయ్‌ అనిపించడం మాత్రం ఖాయమని హింట్స్‌ ఇస్తున్నాడు. 

Ram Gopal Varma Movie on KA Paul:

RGV Revenge on Praja Shanti Party President

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ