Advertisementt

నిఖిల్ సినిమా టైటిల్ మారింది!

Mon 04th Feb 2019 08:03 PM
nikhil,mudra,nikhil mudra,arjun suravaram,nikhil as arjun suravaram,lavanya tripati  నిఖిల్ సినిమా టైటిల్ మారింది!
nikhil mudra title chenged నిఖిల్ సినిమా టైటిల్ మారింది!
Advertisement
Ads by CJ

నిఖిల్ న‌టిస్తున్న త‌మిళ రీమేక్ `ముద్ర‌` టైటిల్ వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. ఇదే టైటిల్‌తో జ‌గ‌ప‌తిబాబు హీరోగా న‌ట్టికుమార్ ఓ చిత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. సేమ్ లోగో, టైటిల్ కావ‌డంతో ఈ సినిమా కోసం ఆన్‌లైన్‌లో టికెట్‌లు కొన్నారు. అయితే ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఓ అభిమాని నిఖిల్ సినిమా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ట్విట్ట‌ర్ ద్వారా హీరో నిఖిల్‌కి చేర‌వేశాడు. దీనికి షాక‌యిన నిఖిల్ వెంట‌నే దిద్దుబాట‌కు పూనుకున్నాడు. ఇది నా సినిమా కాద‌ని ఎవ‌రో త‌ప్పుదారి ప‌ట్టించ‌డానికే టైటిల్ లోగోను కాపీ చేశారంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డాడు. దీనిపై అమావాస్య‌కు, పున్నానికి సినిమాలు తీసే న‌ట్టికుమార్ కౌంట‌ర్ ఇచ్చాడు. 

దీంతో పేడ‌లో రాయివేయ‌డం ఎందుకులే అని మ‌న‌సు మార్చుకున్న చిత్ర బృందం `ముద్ర‌` టైటిల్‌ని కాస్తా ప‌క్క‌న పెట్టి ఈ చిత్రానికి కొత్త టైటిల్‌ని ఖ‌రారు చేశారు. అదే `అర్జున్ సుర‌వ‌రం`. త‌మిళ ద‌ర్శ‌కుడు సంతోష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ మార్చేశామ‌ని తెలియ‌జేస్తూ కొత్త టైటిల్ పోస్ట‌ర్‌ను హీరో నిఖిల్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుని ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశాడు. ``అర్జున్ సుర‌వ‌రం`. ఇదిగో ఫ్రెష్ పోస్ట‌ర్. మార్చి 29న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ద‌య‌చేసి ఈ విష‌యాన్ని ప్ర‌పంచం మొత్తం స్ప్రెడ్ చేయండి` అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.  ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్టుగా క‌నిపించ‌బోతున్నాడు. విద్యా వ్య‌వ‌స్థ నేప్యంలో  రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 29న విడుద‌ల చేస్తున్నారు. 

nikhil mudra title chenged:

nikhil as arjun suravaram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ