Advertisementt

RRR: జమీందారు, పేదోడు.. వాటయ్యా?

Tue 05th Feb 2019 06:08 PM
rrr,charan zamindar,ntr poor,rrr movie story,ss rajamouli,ram charan,new story,jr ntr  RRR: జమీందారు, పేదోడు.. వాటయ్యా?
RRR Story: Ram Charan Zamindar, NTR Poor RRR: జమీందారు, పేదోడు.. వాటయ్యా?
Advertisement
Ads by CJ

రాజమౌళి తన స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో కలిసి RRR సెట్స్‌పై షూటింగ్ చేసుకుంటూ.. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఎన్టీఆర్ తో చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న రాజమౌళి ఆ సినిమా విషయంలో చాలా విషయాలు బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లిద్దరితో తన సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టాడు. RRR మొదటి షెడ్యూల్ అండ్ సెకండ్ షెడ్యూల్ లోను రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ కాంబో సీన్స్ నే తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు హీరోయిన్స్ విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా రాజమౌళి జాగ్రత్తపడ్డాడు. ఇక హీరోయిన్స్ విషయంలో మీడియా రోజుకో వార్త సృష్టిస్తుంది.

తాజాగా అలియా భట్, చరణ్ కి జోడిగా ఎంపికయ్యిందనే న్యూస్ హైలెట్ అయ్యింది కూడా... ఇక మొదటినుండి RRR కథపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. RRR కథ 1940 నేపథ్యంలో ఉండబోతుందని... ఆ సమయంలో రామ్ చరణ్ జమీందారు గాను, ఎన్టీఆర్ అయితే చాలా పేదవానిగాను కనిపిస్తాడని.. అలాగే ఒక జన్మలో ఎన్టీఆర్, చరణ్ లు అన్నదమ్ములుగా పుడితే.. మరుజన్మలో ఎన్టీఆర్, చరణ్‌లు అన్నదమ్ములుగా కనిపిస్తారట.  అయితే ఒక జన్మలో స్నేహితులుగా చరణ్, ఎన్టీఆర్ ఒక బలమైన కారణంతో విడిపోతారట.

అంతేకాకుండా మరు జన్మలో అన్నదమ్ములైన చరణ్, ఎన్టీఆర్ లు కూడా మరో బలమైన కారణం చేతనే విడిపోతారని ఒక గాసిప్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి రాజమౌళి తన మానాన తాను పనిచేసుకుపోతున్నాడు. మీడియాలో వచ్చే వార్తలకు అస్సలు స్పందించడం లేదు. అలాగే ఎప్పుడూ కథ ని చెప్పి సినిమా మొదలెట్టే రాజమౌళి.. ఈసారి కథను దాచేసే సరికి అందరూ రాజమౌళి సినిమా విషయంలో అనేక కథలు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. అలాగే హీరోయిన్స్ విషయంలోనూ ఈ తరహా గాసిప్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

RRR Story: Ram Charan Zamindar, NTR Poor:

RRR: Charan Zamindar, NTR Poor 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ